తెలంగాణ

telangana

ETV Bharat / business

'ఆన్​-ఆఫ్'తో డిజిటల్​ లావాదేవీలు మరింత సురక్షితం!​ - 'ఆన్​-ఆఫ్'తో డిజిటల్​ లావాదేవీలు మరింత సురక్షితం!​

డిజిటల్ లావాదేవీలు మరింత సురక్షితంగా జరగడానికి, మోసాలను నివారించడానికి ఆర్​బీఐ కీలక సూచనలు చేసింది. వినియోగదారులకు తమ క్రెడిట్​, డెబిట్ కార్డులను ఆన్-ఆఫ్​ చేసుకునే సదుపాయం కల్పించాలని బ్యాంకులు, కార్డులు జారీ చేసే సంస్థలకు సూచించింది.

RBI asks issuers to provide facility to switch on, off cards to prevent frauds
'ఆన్​-ఆఫ్'తో డిజిటల్​ లావాదేవీలు మరింత సురక్షితం!​

By

Published : Jan 16, 2020, 11:53 AM IST

వినియోగదారులకు తమ క్రెడిట్​, డెబిట్ కార్డులను ఆన్-ఆఫ్​ చేసుకునే సదుపాయం కల్పించాలని ఆర్​బీఐ.. బ్యాంకులు, కార్డులు జారీచేసే సంస్థలకు సూచించింది. దీని వల్ల డిజిటల్ లావాదేవీల భద్రతను పెంచడానికి, మోసాలను నివారించడానికి వీలవుతుందని పేర్కొంది.

లావాదేవీల భద్రత కోసం..

కార్డుల ద్వారా జరిగే లావాదేవీల పరిమాణం, విలువ చాలా రెట్లు పెరిగింది. ఈ కార్డులను జారీ చేసే సమయంలో... భౌతిక, వర్చువల్ కార్డులన్నీ 'కాంటాక్ట్ బెస్డ్​ పాయింట్ల' వద్ద మాత్రమే ఉపయోగించడానికి వీలయ్యేలా, భారత్​లో మాత్రమే చెల్లుబాటు అయ్యేలా ఉండాలని ఆదేశించింది.

మరింత సౌలభ్యం కోసం

కార్డు లేని(దేశీయ, అంతర్జాతీయ) లావాదేవీలు, కార్డ్​ ప్రెజెంట్​ (అంతర్జాతీయ) లావాదేవీలు, కాంటాక్ట్​లెస్ లావాదేవీలు చేసుకునే సదుపాయాన్ని వినియోగదారులకు అందించాలని ఆర్​బీఐ సూచించింది. ఇందుకు సంబంధించిన నిబంధనలతో... బ్యాంకులు, కార్డు జారీదారులకు ఓ సర్క్యులర్​ను జారీ చేసింది.

"అన్ని రకాల లావాదేవీలు... అవి దేశీయ, అంతర్జాతీయ/ పీఓఎస్​/ఏటీఎమ్/ ఆన్​లైన్ లావాదేవీలను 24X7 ప్రాతిపదికన అందించాలి. అలాగే వినియోగదారులు తమ క్రెడిట్​, డెబిట్​ కార్డులను ఆన్​, ఆఫ్​ చేసుకునే సదుపాయం కల్పించాలి."- ఆర్​బీఐ

మొబైల్ అప్లికేషన్​, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎమ్​, ఇంటరాక్టివ్ వాయిస్​ రెస్పాన్స్​ల్లో కూడా ఈ కార్డుల ఆన్​-ఆఫ్ సదుపాయం ఉండాలని ఆర్​బీఐ స్పష్టం చేసింది.

నిర్ణయం మీదే... కానీ

ప్రస్తుతం ఉన్న (ఆన్-ఆఫ్​ సౌకర్యం లేని) కార్డులను నిలిపివేయాలా వద్దా అనేదానిపై కార్డు జారీదారులు నిర్ణయం తీసుకోవచ్చని ఆర్​బీఐ స్పష్టం చేసింది. అయితే ఆన్​లైన్(కార్డ్​ నాట్ ప్రెజెంట్​), అంతర్జాతీయ, కాంటాక్ట్​లెస్ లావాదేవీల కోసం ఎప్పుడూ ఉపయోగించని కార్డులు మాత్రం తప్పకుండా నిలిపివేయాలని స్పష్టం చేసింది. ప్రీపెయిడ్ గిఫ్ట్​కార్డులు, మాస్​ ట్రాన్సిట్ సిస్టమ్స్​లో ఉపయోగించిన వాటికి తాజా సూచనలు తప్పనిసరి కాదని ఆర్​బీఐ పేర్కొంది.

సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్​బీఐ తాజా సూచనలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.

ఇదీ చూడండి:గూడ్స్​ను ఢీకొన్న ఎక్స్​ప్రెస్​ రైలు.. 15మందికి గాయాలు

ఇదీ చూడండి: తొలిసారి 42వేల మార్క్​ అందుకున్న సెన్సెక్స్​

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details