తెలంగాణ

telangana

జేఆర్​డీతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న రతన్​ టాటా

By

Published : Jul 30, 2021, 7:42 AM IST

జహంగీర్‌ రతన్‌జీ దాదాభాయ్‌(జేఆర్‌డీ) టాటా 117వ జయంతి సందర్భంగా.. ఆయనతో తనకున్న మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా. జేఆర్‌డీతో కలిసి తీసుకున్న అరుదైన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్​ చేశారు.

ratan tata
రతన్​ టాటా

జ్ఞాపకాలు.. ఎవరికైనా మధురాలే. రతన్‌ టాటా వంటి దిగ్గజ పారిశ్రామికవేత్త కూడా ఇందుకు అతీతులు కారు. 81 ఏళ్ల తన జీవిత పుస్తకంలో కొన్ని పేజీలను గురువారం తిరగేశారు. తన గురువు, స్నేహితుడు జహంగీర్‌ రతన్‌జీ దాదాభాయ్‌(జేఆర్‌డీ) టాటా 117వ జయంతి సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో వాటిని పంచుకున్నారు.

'జేఆర్‌డీ కలల్లో ఒకటి టాటా కారును ఆవిష్కరించడం. ఆయన సంకల్పం నెరవేర్చడంలో ఆర్కిటెక్ట్‌ సుమంత్‌ మూల్గావ్‌కర్‌ భాగమే. జేఆర్‌డీ కలను టెల్కో నెరవేర్చింది' అంటూ పుణె ప్లాంటులో టాటా ఎస్టీమ్‌ కారు విడుదల సందర్భంగా జేఆర్‌డీతో కలిసి తీసుకున్న ఫొటోను రతన్​ టాటా షేర్​ చేశారు. 1991లో టాటా సన్స్‌ పగ్గాలను రతన్‌ టాటాకు జేఆర్‌డీ అప్పగించారు. వీరిద్దరి మధ్య రక్త సంబంధానికి మించిన అనుబంధం ఉంది. జేఆర్‌డీని 'జే' అని టాటా పిలుచుకుంటారు.

గతేడాది (116వ జయంతి రోజున) కూడా ఇదే తరహాలో ఒక ఫొటోను రతన్‌టాటా పంచుకున్నారు. బీ1బీ బాంబర్‌, స్పేస్‌ షటిల్‌ తయారీ ప్లాంట్లను జేఆర్‌డీతో కలిసి సందర్శించిన చిత్రాన్ని అప్పుడు పంచుకున్నారు. చాలా మందికి లభించని అవకాశం తమకు దక్కిందని.. అపుడు జేఆర్‌డీ కళ్లల్లో మెరుపును చూసి తీరాల్సిందేనంటూ అప్పట్లో రతన్‌ టాటా రాసుకొచ్చారు.

ఇదీ చూడండి:ఈ కుబేరుల కెరీర్​ ఎలా మొదలైందో తెలుసా?

ఇదీ చూడండి:JAMSETJI TATA: దాతృత్వంలో జెంషెట్​ జీ టాటాదే అగ్రస్థానం!

ABOUT THE AUTHOR

...view details