ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ జులై 31న బజాజ్ ఫైనాన్స్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పదవి నుంచి వైదొలగనున్నారు. అయితే ఆయన నాన్ ఎగ్జిక్యూటివ్ నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా కొనసాగనున్నారు.
వారసుడొస్తున్నాడు..
రాహుల్ బజాజ్ తరువాత ప్రస్తుత వైస్ ఛైర్మన్ సంజీవ్ బజాజ్... బజాజ్ ఫైనాన్స్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా బాధ్యతలు తీసుకుంటారని సంస్థ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. 2020 ఆగస్టు 1న ఆయన బాధ్యతలు తీసుకుంటారని స్పష్టం చేసింది.