తెలంగాణ

telangana

ETV Bharat / business

'పట్టణీకరణలో పెట్టుబడులకు భారత్​ భేష్​'

పట్టణీకరణ, మొబిలిటీ, ఆవిష్కరణల్లో పెట్టుబడులకు భారత్ అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానమని ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. వచ్చే రెండు దశాబ్దాల్లో భారత్, కొన్ని ఆఫ్రికా దేశాలు పట్టణీకరణలో చాలా పెద్ద మార్పులకు సాక్ష్యంగా నిలుస్తాయని పేర్కొన్నారు.

BIZ-PM
మోదీ

By

Published : Nov 17, 2020, 7:53 PM IST

కరోనా తర్వాత ప్రపంచాన్ని పునర్నిర్మించాల్సి ఉంటుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. బ్లూమ్​బర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్​లో ప్రసంగించిన మోదీ.. నగరాలు జీవనానికి మరింత అనుకూలంగా మారాల్సి ఉంటుందన్నారు.

ఈ పరిస్థితుల్లో పట్టణీకరణ, ఆవిష్కరణల్లో పెట్టుబడులు పెట్టేవారికి భారత్ మంచి గమ్యస్థానమని తెలిపారు.

"2022 నాటికి కోటి ఇళ్లను నిర్మించి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 100 స్మార్ట్​ సిటీల్లో రూ.2లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టాం. ఇప్పటికే రూ.1.4 లక్షల కోట్ల ప్రాజెక్టులు పూర్తయ్యాయి లేదా చివరి దశలో ఉన్నాయి. మీరు పట్టణీకరణలో పెట్టుబడులు పెట్టాలంటే భారత్​లో మంచి అవకాశాలు ఉన్నాయి. సుస్థిర రంగాల్లో పెట్టుబడులకు అయితే మరింత సౌలభ్యం ఉంటుంది."

- నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

ఈ అవకాశాలన్నీ భారత్​లోని ప్రజాస్వామ్యం, వాణిజ్య వాతావరణం, అతిపెద్ద మార్కెట్​ వల్లనే సాధ్యమవుతాయని మోదీ అన్నారు. పట్టణీకరణలో భారత్​ మరింత దూకుడుగా వెళుతోందని తెలిపారు.

ఇదీ చూడండి:'ఉగ్రవాదంపై ఆ దేశాలను బాధ్యులుగా చేయాలి'

ABOUT THE AUTHOR

...view details