కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని రకాల వ్యాపారాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొవిడ్-19 నేపథ్యంలో సప్లయి, డిమాండ్ వ్యవస్థ దెబ్బతింది. కరోనా కారణంగా ఫిబ్రవరిలో 61.8 మిలియన్ల స్మార్ట్ఫోన్లు మాత్రమే విక్రయమైనట్లు స్ట్రాటజీ అనలైటిక్స్ సర్వేలో తేలింది. గత ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే.. ఈసారి విక్రయించిన స్మార్ట్ఫోన్ల సంఖ్య 38 శాతం తక్కువని తెలిపింది.
"ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ మునుపెన్నడూ చూడనంత పతనాన్ని 2020 ఫిబ్రవరిలో నమోదు చేసింది. దీనిని గుర్తుచేసుకోకూడదని స్మార్ట్‌ఫోన్ పరిశ్రమ భావిస్తోంది. స్మార్ట్‌ఫోన్ సప్లయి, డిమాండ్‌కు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర అంతరాయం ఏర్పడింది." -స్ట్రాటజీ అనలైటిక్స్