తెలంగాణ

telangana

ETV Bharat / business

చైనాతో త్వరలోనే రెండో దశ వాణిజ్య చర్చలు: ట్రంప్​ - AMERICA CHINA TRADE DEAL

చైనాతో తొలి దశ వాణిజ్య ఒప్పందంపై సంతకం పెట్టకుండానే.. రెండో దఫాపై సంకేతాలిచ్చారు ట్రంప్​. త్వరలోనే చర్చలు ప్రారంభమవుతాయని.. కానీ ఫలితాల కోసం అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసే వరకు వేచి చూడాలన్నారు.

'Phase Two' China trade deal may come after US election: Trump
చైనాతో త్వరలోనే రెండో దశ వాణిజ్య చర్చలు: ట్రంప్​

By

Published : Jan 10, 2020, 10:59 AM IST

Updated : Jan 10, 2020, 1:55 PM IST

'చైనాతో త్వరలోనే రెండో దశ వాణిజ్య చర్చ'

వాణిజ్య యుద్ధంతో దాదాపు రెండేళ్ల పాటు వార్తల్లో నిలిచిన అమెరికా-చైనా.. ఇప్పుడు స్నేహగీతం పాడుతునట్టు కనిపిస్తోంది. ఎన్నో చర్చలు, సమావేశాల తర్వాత ఈ నెల 15న ఇరు దేశాల మధ్య తొలి దశ వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసే అవకాశముందని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. అది పూర్తి కాక ముందే రెండో దశ ఒప్పందంపై సంకేతాలిచ్చారు ట్రంప్​. ఆలస్యం కాకుండానే రెండో దశ ఒప్పందం దిశగా చర్చలు ప్రారంభమవుతాయని అగ్రరాజ్య అధ్యక్షుడు స్పష్టం చేశారు. కానీ ఈ చర్చల ఫలితాల కోసం అమెరికా అధ్యక్ష ఎన్నికల వరకు వేచి చూడాలన్నారు.

"ఫేజ్​ 2 కోసం వెంటనే సంప్రదింపులు ప్రారంభిస్తాం. కానీ ఎన్నికల వరకూ వేచి చూడాలి. ఆ తర్వాతే మంచి, మెరుగైన ఒప్పందం కుదుర్చుకోవచ్చు."

--- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు.

వాణిజ్య యుద్ధంతో రెండు అగ్రరాజ్యాల మధ్య ఇన్నేళ్లు నడిచిన మాటల యుద్ధం.. ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపింది. అయితే అనేక దశలుగా సాగిన చర్చల అనంతరం గతేడాది డిసెంబర్​లో అమెరికా-చైనా మధ్య తొలి దఫా వాణిజ్య ఒప్పందంపై సంధి కుదిరింది. ఈ నేపథ్యంలోనే మరికొద్ది రోజుల్లో బీజింగ్​ నుంచి ఓ బృందం అమెరికాకు వెళ్లనునట్టు తెలుస్తోంది.

ఇదీ చదవండి: ట్రేడ్​ వార్​కు చెక్​.. వాణిజ్య ఒప్పందానికి అంగీకారం

Last Updated : Jan 10, 2020, 1:55 PM IST

ABOUT THE AUTHOR

...view details