తెలంగాణ

telangana

ETV Bharat / business

మీ ఖాతాలో పీఎఫ్‌ వడ్డీ జమ అయిందా..? చెక్ చేసుకోండి ఇలా - ఈపీఎఫ్ఓ లేటెస్ట్​ న్యూస్

PF Interest Credit: 2020-21 ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్ మొత్తాలపై వడ్డీని చందాదారుల ఖాతాల్లో ఈపీఎఫ్​ఓ జమ చేస్తోంది. 8.5శాతం చొప్పున 25కోట్ల మంది ఖాతాదారుల ఎకౌంట్​లో వడ్డీ జమ కానుంది. మరి మీ ఖాతాలో వడ్డీ జమ అయిందా? లేదా? ఓసారి చూసుకోండి.

pf interest
పీఎఫ్‌ వడ్డీ

By

Published : Dec 14, 2021, 5:19 AM IST

PF Interest Credit: పీఎఫ్‌ చందాదారులకు గుడ్‌న్యూస్‌. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పీఎఫ్‌ మొత్తాలపై వడ్డీని చందాదారుల ఖాతాల్లో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) జమ చేస్తోంది. ఇప్పటికే ఈ ప్రక్రియను ప్రారంభించింది. 8.5 శాతం చొప్పున 25 కోట్ల మంది ఖాతాదారుల ఖాతాల్లో వడ్డీ జమ కానుంది. మీ ఖాతాలో వడ్డీ జమ అయ్యిందో లేదో ఓ సారి చెక్‌ చేసుకోండి. ఎస్సెమ్మెస్‌, ఉమాంగ్‌ యాప్‌, ఈపీఎఫ్‌ఓ వెబ్‌సైట్‌, మిస్డ్‌ కాల్‌ ఇవ్వడం ద్వారా మీ బ్యాలెన్స్‌ను చెక్‌ చేసుకోవచ్చు.

ఈపీఎఫ్‌ఓ పోర్టల్‌: ఈపీఎఓ సభ్యత్వ పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకున్న స‌భ్యులు అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి కూడా బ్యాలెన్స్‌ వివరాలు తెలుసుకోవచ్చు. అందులో 'అవర్‌ సర్వీసెస్‌'లోని 'మెంబర్‌ పాస్‌బుక్‌' విభాగంలోకి వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు యూఏఎన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేయడం కోసం మరో పేజీకి రీడైరెక్ట్‌ అవుతుంది. వివరాలు ఎంటర్‌ చేయడం ద్వారా మీ ఖాతా వివరాలు తెలుసుకోవచ్చు.

మిస్డ్ కాల్ స‌ర్వీస్‌: ఈపీఎఫ్‌ఓతో రిజిస్టర్‌ చేసుకున్న మొబైల్ నుంచి 011-22901406 నంబర్‌కు మిస్డ్‌కాల్‌ ఇవ్వడం ద్వారా పీఎఫ్‌ బ్యాలెన్స్‌ తెలుసుకోవచ్చు. మీరు మిస్డ్‌కాల్‌ ఇచ్చిన తర్వాత ఓ రింగ్‌ అయి వెంటనే కాల్‌ కట్‌ అవుతుంది. కాసేపటికే బ్యాలెన్స్‌ వివరాలు ఎస్సెమ్మెస్‌ రూపంలో ప్రత్యక్షమవుతాయి.

ఉమాంగ్‌ యాప్‌:కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉమాంగ్‌ యాప్‌ ద్వారా మీ పీఎఫ్‌ బ్యాలెన్స్‌ తెలుసుకునే వీలుంది. అందుకోసం ఉమాంగ్‌ యాప్‌లోని ఈపీఎఫ్‌ఓను ఎంచుకోవాలి. అందులో 'ఎంప్లాయీ సెంట్రిక్‌ సర్వీసెస్‌' విభాగంలోకి వెళ్లి వ్యూ పాస్‌బుక్‌'ను క్లిక్‌ చేయాలి. అప్పుడు మీ యూఏఎన్‌ నంబర్‌తో పాటు మీ మొబైల్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. అప్పుడు కనిపించే మెంబర్‌ ఐడీని క్లిక్‌ చేయడం ద్వారా పీఎఫ్‌ బ్యాలెన్స్‌ను పొందొచ్చు. అయితే, మీ పీఎఫ్‌ ఖాతాతో మొబైల్‌ నంబర్‌ ముందే జత చేసి ఉండాలి.

ఎస్సెమ్మెస్‌ ద్వారా: యూఏఎన్‌ యాక్టివేట్‌ చేసుకున్న చందాదారులు ఈపీఎఫ్‌ ఖాతాకు జత చేసిన మొబైల్‌ నుంచి 'ఈపీఎఫ్ఓహెచ్ఓ యూఏఎన్​' అని టైప్ చేసి 77382 99899 నంబ‌ర్‌కు ఎస్సెమ్మెస్‌ పంపించాలి. ప్రస్తుతం ఈ సదుపాయం పది ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంది. ఒకవేళ తెలుగులో కావాలంటే 'ఈపీఎఫ్ఓహెచ్​ఓ యూఏఎన్ టెల్' అని ఎస్సెమ్మెస్‌ పంపించాల్సి ఉంటుంది.

ఇదీ చూడండి:మళ్లీ పెరిగిన రిటైల్​ ద్రవ్యోల్బణం- నవంబర్​లో 4.91శాతం

ABOUT THE AUTHOR

...view details