ఇటీవల కేంద్రం తగ్గించిన ఎక్సైజ్ సుంకంతో పాటు.. పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వ్యాట్ తగ్గగా ఇంధన ధరలు దిగొచ్చాయి. వీటిలో మహారాష్ట్ర, దిల్లీ, బంగాల్ వంటి రాష్ట్రాలతో పోల్చితే భాజపా, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు బాగా తగ్గాయి.
కేంద్రం ప్రకటించిన ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో దేశవ్యాప్తంగా లీటరు పెట్రోల్ ధర కనిష్ఠంగా రూ.5.7, గరిష్ఠంగా రూ.6.35 వరకు దిగొచ్చింది. డీజిల్ ధర కనిష్ఠంగా రూ.11.16, గరిష్ఠంగా రూ.12.88 మేర తగ్గింది. అలాగే పలు రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గింపుతో ధరల్లో మార్పులను ఓసారి గమనిస్తే..
- ఉత్తరప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు వరుసగా రూ.6.96, రూ.12.04 మేర తగ్గాయి.
- లద్దాఖ్‌లో లీటరు పెట్రోల్‌పై రూ.8.70, డీజిల్‌పై రూ.17.5 తగ్గింది.
- కర్ణాటకలో లీటర్ పెట్రోల్ ధర రూ.8.62, డీజిల్ ధర రూ.9.40కి తగ్గింది.
- మధ్యప్రదేశ్‌లో లీటర్ ధర పెట్రోల్ రూ.6.89, డీజిల్ ధర రూ.6.96 క్షీణించింది.
- దిల్లీలో పెట్రోల్ ధర రూ.6.07, డీజిల్ ధర రూ.11.75 తగ్గింది.
- ఉత్తరాఖండ్‌లో లీటరు పెట్రోల్‌పై రూ.1.97, డీజిల్‌పై రూ.9.52 తగ్గింది.
ఆ రాష్ట్రాల్లో మాత్రం...