పెట్రోల్, డీజిల్ ధరలు గురువారం స్వల్పంగా తగ్గాయి. పెట్రోల్‌పై లీటరుకు 16 పైసలు, డీజిల్ 14 పైసలు తగ్గింది. వరుసగా ఆరు నెలల పాటు పెరుగుతూ వచ్చిన చమురు ధరలు ఇటీవల కాలంలో స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి.
స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. పెట్రోల్‌పై లీటరుకు 16 పైసలు, డీజిల్ 14 పైసలు తగ్గింది. గత మూడు వారాల్లో ఇలా తగ్గడం ఇది నాలుగోసారి.
గత మూడు వారాల్లో ఇలా తగ్గడం ఇది నాలుగోసారి. ప్రస్తుతం దేశ రాజధాని దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.90.40 ఉండగా, డీజిల్ ధర రూ.80.79గా ఉంది. తగ్గిన ధరలు దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. రాష్ట్రాలు విధించే పన్నులు ఆధారంగా ధరల్లో స్వల్ప మార్పు ఉంటుంది. ఆరు నెలల పాటు వరుసగా పెట్రోల్ ధరలు పెరగ్గా, ఈ ఏడాది మార్చి 24 నుంచి స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. కాగా, తాజా తగ్గింపుతో పెట్రోల్‌పై 67 పైసలు, డీజిల్‌పై 74పైసల భారం తగ్గింది.
ఇదీ చదవండి:రూ.15 వేల లోపు ఉత్తమ స్మార్ట్ఫోన్లు ఇవే!