దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 82లను దాటింది. అదే దారిలో పయనించిన డీజిల్ కూడా రూ.72కు చేరింది. గత తొమ్మిది రోజుల్లో రేట్లు పెరగడం ఇది ఎనిమిదో సారి. కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి సానుకూల వార్తలు రావడం కారణంగా కంపెనీలు పెట్రోల్ పై 24 పైసలు, డీజిల్‌పై 27 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.
ఆగని 'పెట్రో' మంట- ఎంత పెరిగిందంటే! - petrol price in delhi
పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గత తొమ్మిది రోజుల్లో ఎనిమిది సార్లు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి చమురు సంస్థలు. ఈ క్రమంలో దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.82 లను దాటింది. అదే విధంగా పెరిగిన డీజిల్ రూ. 72 చేరుకుంది.
రూ.82 దాటిన పెట్రోల్, అదే బాటలో డీజిల్
ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ,హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లు పెరిగిన అంతర్జాతీయ చమురు ధర, విదేశీ మారకపు రేటు ఆధారంగా రోజువారీ పెట్రోల్, డీజిల్ రేట్లను సవరిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.
Last Updated : Nov 28, 2020, 3:26 PM IST