Product Price Hike: కొవిడ్ పరిణామాల నుంచి బయట పడేందుకు సామాన్యుడు అష్టకష్టాలు పడుతుంటే, వివిధ ఉత్పత్తుల ధరలు పెరుగుతూ మరింత వేదన మిగులుస్తున్నాయి. వంటనూనెల ధరలు మరుగుతుంటే, 5 రాష్ట్రాల ఎన్నికల కోసం 3 నెలలుగా ఉపశమించిన పెట్రోల్-డీజిల్ ధరలు తదుపరి మండిపోతాయని నివేదికలు తేల్చిచెబుతున్నాయి. మొబైల్ టారిఫ్‌లు కూడా మళ్లీ పెరిగితే ఇంటి బడ్జెట్‌పై మరింత ఒత్తిడి తప్పదు.
లీటరుకు రూ.8-9 పెరగొచ్చు: డెలాయిట్
Petrol price hike: పెట్రోల్ ధర సెంచరీ కొట్టింది.. ఇంకా ఏం పెంచుతాములే అని చమురు కంపెనీలు ధరల పెంపును ఆపాయనుకుంటున్నారా.. పైగా అంతర్జాతీయంగా ముడిచమురు ధర పెరుగుతున్న నేపథ్యంలో.. దాదాపు 3 నెలలుగా స్తబ్దుగా ఉన్న ధరల పెంపును 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తికాగానే మళ్లీ ప్రారంభిస్తాయని డెలాయిట్ నివేదిక పేర్కొంది. వచ్చే నెలలో ఇంధన ధరల మోత మోగించే యోచనలో కంపెనీలు ఉన్నాయని, ఆ పెంపు కూడా భారీగానే ఉండొచ్చని అంచనా వేస్తోంది. ‘రాష్ట్రాల ఎన్నికల వల్లే దేశీయంగ పెట్రో ధరలు పెంచలేదు’ అని డెలాయిట్ పార్ట్‌నర్ దేవాశిష్ మిశ్రా పేర్కొన్నారు. ఎన్నికలయ్యాక అంటే.. మార్చి 10 వరకు విక్రయ ధరలో ఎంతైతే లోటును భరించాయో, ఆ మొత్తం వసూలు చేసుకునేలా ధరలు పెంచే అవకాశం ఉందని తెలిపారు. లీటరుకు రూ.8-9 వరకు పెరగొచ్చని వివరించారు.
వాస్తవానికి అంతర్జాతీయ ముడిచమురు ధరలకు అనుగుణంగా ప్రభుత్వ రంగ చమురు విక్రయ సంస్థలు (ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్) దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేలా సాంకేతికంగా అనుసంధానమయ్యాయి. అయితే అధిక ధరల వల్ల ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతో, అధికారంలోని పార్టీల అవసరాలకు అనుగుణంగా ఎన్నికల సమయాల్లో చమురు సంస్థలు ధరలను పెంచడం లేదనే విమర్శ దేశీయంగా ఉందని మిశ్రా చెప్పారు.
ఆర్‌బీఐకి సవాలే..:చమురు ధర పెరిగితే కరెంటు ఖాతా లోటు పెరగడమే కాకుండా నిత్యావసరాల ధరలూ అధికమవుతాయి. ద్రవ్యోల్బణ నియంత్రణలో ఆర్‌బీఐకి సవాళ్లు ఎదురవుతాయి. కొవిడ్-19 పరిణామాల నేపథ్యంలో, ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు కీలక రేట్లను ఆర్‌బీఐ పరిమిత స్థాయిలో ఉంచుతోంది. ద్రవ్యోల్బణం పెరిగితే.. కీలక రేట్ల పెంపు దిశగా అడుగులు వేయడం ఆర్‌బీఐకి కష్టం కావచ్చు.
Oil Rate hike
ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి భారత్ చేస్తున్న చర్యలపై ‘పెరుగుతున్న వంటనూనెల ధరలు’ ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ప్రపంచంలోనే ఎక్కువగా వినియోగించే వంట నూనె అయిన పామాయిల్ ధర ఈ ఏడాది 15 శాతం పెరిగింది. సోయాబీన్ నూనె 12 శాతం ప్రియం కావడంతో, అంతర్జాతీయ ఆహార ద్రవ్యోల్బణాన్ని ఆల్‌టైం గరిష్ఠాల సమీపానికి చేరింది. పామాయిల్, సోయాబీన్, పొద్దుతిరుగుడు పువ్వు నూనెలను ఎక్కువగా కొనుగోలు చేసే భారత్‌పై ఈ ధరల పెరుగుదల ఒత్తిడి తీసుకొచ్చింది. వినియోగదారు ఆహార ధరలు 6 నెలల్లోనే ఎన్నడూ లేనివిధంగా గత డిసెంబరులో పెరిగాయి. ఇందువల్ల ఇంటి బడ్జెట్‌పైనే కాదు.. 80 కోట్ల మందికి ఆహార మద్దతు ఇస్తున్న ప్రభుత్వంపైనా ఒత్తిడి పెరిగింది. అందుకే పామాయిల్, సోయాబీన్, పొద్దుతిరుగుడు పువ్వు నూనెలపై దిగుమతి సుంకాలను సైతం తగ్గించారు. భారీమొత్తం నిల్వలను అట్టేపెట్టిఉంచకుండా పరిమితులు విధించారు.
ఇపుడు ఏం చేయాలంటే..