తెలంగాణ

telangana

ETV Bharat / business

వరుసగా ఐదో రోజు పెరిగిన చమురు ధరలు

ఆయిల్ కంపెనీలు వరుసగా ఐదో రోజు చమురు ధరలు పెంచాయి. ఇవాళ పెట్రోల్, డీజిల్​ ధరలు లీటర్​కు 60 పైసలు చొప్పున పెరిగాయి.

Petrol, diesel prices hiked by 60 paise/litre each
వరుసగా ఐదో రోజు పెరిగిన చమురు ధరలు

By

Published : Jun 11, 2020, 10:15 AM IST

దేశంలో వరుసగా ఐదో రోజూ చమురు ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్​ ధరలు లీటర్​కు 60 పైసలు చొప్పున పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. కరోనా నేపథ్యంలో దాదాపు మూడు నెలలపాటు చమురు ధరలు పెంచని ఆయిల్ కంపెనీలు ఆదివారం నుంచి వరుసగా ధరలను పెంచుతున్నాయి.

దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.74, లీటర్ డీజీల్ ధర 72.22గా ఉంది. ఆయా రాష్ట్రాల్లో విధించే స్థానిక పన్నుల ఆధారంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో మార్పులు ఉన్నాయి.

మొత్తంగా చూసుకుంటే... గత ఐదు రోజుల్లో పెట్రోల్ ధర లీటరుకు రూ.2.74 పైసలు, డీజల్ ధర లీటర్​కు 2.83 పైసలు చొప్పున పెరిగాయి. ముడిచమురు ఉత్పత్తిని ఒపెక్ దేశాలు తగ్గించడమే... తాజా ధరల పెరుగుదలకు కారణం.

ఇదీ చూడండి:విమానాల్లో మధ్య సీటు మాటేమిటో..?

ABOUT THE AUTHOR

...view details