రెండు రోజుల విరామం తర్వాత దేశంలో చమురు ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 27పైసలు, డీజిల్‌పై 28పైసలు చొప్పున చమురు సంస్థలు ధరలు పెంచాయి. ఫలితంగా దిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 94.76, డీజిల్ రూ.85.66కు పెరిగింది. ముంబయిలో లీటర్ పెట్రోల్ రూ.101.19, డీజిల్ రూ.93.09కు చేరింది.
పెట్రో బాదుడు- మళ్లీ పెరిగిన ధరలు - చమురు ధరలు
దేశంలో చమురు ధరలు మరోసారి పెరిగాయి. రెండు రోజుల విరామం తర్వాత చమురు సంస్థలు పెట్రోల్ డీజిల్ ధరలను పెంచాయి. పెట్రోల్‌పై 27పైసలు, డీజిల్‌పై 28పైసలు పెరిగాయి.
పెరిగిన చమురు ధరలు
హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.98.48, డీజిల్ రూ.93.38 ఉంది. విశాఖలో పెట్రోల్ రూ.99.90, డీజిల్ రూ.94.23లకు ఎగబాకింది. గత నెలలో చమరు ధరలు 16 సార్లు పెరగ్గా.. ఈ నెలలో ఇప్పటివరకు రెండుసార్లు పెరిగాయి. 18 రోజుల్లో లీటర్ పెట్రోల్‌పై రూ.4.36, డీజిల్‌పై రూ.4.93 చొప్పున పెరిగింది.
ఇదీ చదవండి :రిలయన్స్ సీఎస్ఆర్ నిధులు రూ.1,140కోట్లు