కొవిడ్-19 కారణంగా విధించిన లాక్డౌన్తో చాలా సంస్థలు నష్టాలు ఎదుర్కొంటే.. 'పార్లే-జీ' మాత్రం రికార్డు స్థాయి అమ్మకాలతో లాభాల బాటలో దూసుకెళ్లింది. ఏకంగా ఎనభై ఏళ్ల సేల్స్ రికార్డులన్నీ కేవలం మూడే నెలల్లో తుడిచేసింది.
మార్చి, ఏప్రిల్, మే నెలల్లో భారీ స్థాయిలో అమ్మకాలు జరిగినట్లు తెలిపారు పార్లే సంస్థ ప్రతినిధులు. 1938లో ప్రారంభమైన ఈ సంస్థ లాక్డౌన్లో అత్యధిక అమ్మకాలు సాధించిందట. అయితే పూర్తి గణాంకాలు చెప్పేందుకు సంస్థ ప్రతినిధులు నిరాకరించారు. ఈ సేల్స్ వల్ల మార్కెట్ షేర్ 5 శాతం పెరిగినట్లు చెప్పారు. ఇందులో 80-90 శాతం వృద్ధి పార్లే-జీ బిస్కెట్ల అమ్మకాల వల్లే వచ్చినట్లు స్పష్టం చేశారు. ఈ సంస్థతో పాటు బ్రిటానియా గుడ్ డే, టైగర్, మిల్క్ బికీస్, బార్బన్, క్రాక్జాక్, మొనాకో, హైడ్ అండ్ సీక్ విపరీతంగా అమ్మకాలు సాధించాయి.