స్మార్ట్‌ఫోన్ సాయంతో పాఠ్యాంశాలు నేర్చుకోవడం పిల్లలకు కష్టంగానే ఉంటోంది. అయితే ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు ఆన్‌లైన్ బోధనను తప్పనిసరి చేయడం సహా పాఠ్యాంశాలు బోధిస్తున్నందున, పలు కుటుంబాల్లో పెద్దలు తమ స్మార్ట్‌ఫోన్లనే ఇస్తూ సరిపెడుతున్నారు. అయితే కనీసం జులై కన్నా, పరిస్థితి తెరపిన పడుతుందని, సాధారణ పద్ధతుల్లో తరగతులు సాగుతాయని భావించిన వారికి అడియాశే మిగిలింది. కొవిడ్-19 కేసులు అంతకంతకూ పెరుగుతుండటం వల్ల విద్యా సంస్థలు భౌతికంగా ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయమై సందేహం నెలకొంది.
సాఫ్ట్‌వేర్ సంస్థలు కూడా ఉద్యోగులను ఇళ్ల నుంచే పనిచేయమని కోరుతున్నాయి. ఈ నెలాఖరు వరకు ఇంటినుంచే పనిచేయించమని ప్రభుత్వమే ఆదేశించింది. కొన్ని సంస్థలు డిసెంబరు వరకు ఇదే విధానం కొనసాగించాలంటున్నాయి. మరిన్ని నెలల పాటు ఇంటి నుంచే పనిచేసుకునేందుకు పెద్దలు, పిల్లలకు ఆన్‌లైన్ బోధన సులభంగా ఉండేందుకు ల్యాప్‌టాప్‌లు కొంటున్నారు. పిల్లల కోసం 8-12 అంగుళాల తెర ఉండే ట్యాబ్లెట్‌లనూ కొందరు కొంటున్నారు.
అయితే ఉన్నత విద్య వరకు పనికొస్తుందనే భావనతోనే ల్యాప్‌టాప్ కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారని విక్రయశాలల ప్రతినిధులు చెబుతున్నారు. ఇంటర్ పూర్తయిన వారైతే, విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే, విదేశాల నుంచి వచ్చే బంధువులు, స్నేహితులతో ల్యాప్‌టాప్‌లను తెప్పించుకునేవారు. మార్చి నుంచే విమానాలు లేక ఇప్పుడా అవకాశమే లేకపోయింది. అందుకే అక్కడితో పోలిస్తే, ఇక్కడ ధర కాస్త అధికమైనా, కొనుగోలు చేయకతప్పడం లేదు.
ల్యాప్‌టాప్‌లపై ఆఫర్లు