ఓటీపీ ఆధారంగా రూ.10వేలు, అంతకుమించి నగదు ఉపసంహరణ చేసే పద్ధతిని రోజంతా అమలు చేయనున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. ఈ సదుపాయం సెప్టెంబర్ 18 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది.
దీని ప్రకారం.. డెబిట్‌కార్డు కలిగినవారు ఏటీఎంకు వెళ్లి, రూ.10,000, అంతకు మించి ఉపసంహరించాలంటే, రిజిస్టర్ మొబైల్‌కు వచ్చే ఓటీపీ కూడా నమోదు చేయాల్సి ఉంది. అంటే డెబిట్ కార్డుతో పాటు బ్యాంకు వద్ద నమోదైన మొబైల్ కలిగి ఉంటేనే నగదు ఉపసంహరించే వీలుంటోంది.
ఈ ఏడాది జనవరిలో ఈ సదుపాయాన్ని కల్పించినప్పటి నుంచి రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు మాత్రమే అమలవుతోంది.