కొవిడ్ వ్యాక్సిన్ సంబంధిత వార్తలు, అమెరికాలో తాజా ఉద్దీపన ప్యాకేజీపై ఆశలు ఈ వారం స్టాక్ మార్కెట్లకు దిశా నిర్దేశం చేయనున్నాయి. వీటితో పాటు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం, ఇతర భౌగోళిక, రాజకీయ పరిణామాలు మార్కెట్లకు కీలకంగా మారనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
కరోనా వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి రానున్నట్లు వెలువడిన వార్తలు, అమెరికా ఉద్దీపన ప్యాకేజీ ఆశలతో గత వారం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రధాన స్టాక్ మార్కెట్లు భారీగా లాభాలను నమోదు చేశాయి. ఈ వారం కూడా ఆ సానుకూలతలు కొనసాగే అవకాశముందంటున్నారు నిపుణులు.