దేశీయ విద్యుత్ వాహనాల తయారీ సంస్థ ఓలా.. ఎలక్ట్రిక్ స్కూటర్ల వ్యాపారానికి సంబంధించి మరో కీలక ప్రకటన చేసింది. తాము తీసుకువస్తున్న ఈ స్కూటర్‌ను పొందడానికి రిజిస్ట్రేషన్లను ప్రారంభిస్తునట్లు తెలిపింది. ఇందుకోసం వినియోగదారులు రూ.499లతో వారి పేర్లను నమోదు చేసుకోవాలని సూచించింది.
ఓలా నుంచి రానున్న ఈ స్కూటర్ కోసం ఎదురు చూస్తున్న వారు తమ వెబ్సైట్ http://olaelectric.com లో లాగిన్ అయ్యి వాహనాన్ని బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు సంబంధిత వివరాలతో గురువారం ట్వీట్ చేసింది.
"ఓ మలుపునకు ఇదే మొదటి రోజు. మనమందరం ఎంతగానో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇప్పుడు కేవలం రూ. 499 చెల్లింది రిజర్వ్ చేసుకోండి. ఇందుకుగానూ http://olaelectric.com లోకి లాగిన్ అవ్వండి. మార్పునకు శ్రీకారం చుట్టండి. "
-ఓలా, ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ