దేశీయ విద్యుత్ వాహనాల తయారీ సంస్థ ఓలా ప్రవేశపెట్టిన ఈ-స్కూటర్లకు భారీ స్పందన లభిస్తోంది. 24 గంటల్లో లక్ష బుకింగ్‌లు వచ్చినట్లు ఓలా ఎలక్ట్రిక్ శనివారం వెల్లడించింది.
గురువారం సాయంత్రం నుంచి ఓలా.. బుకింగ్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ వ్యవహారంపై సంస్థ సీఈఓ హర్షం వ్యక్తం చేశారు.
"దేశవ్యాప్తంగా వినియోగదారుల నుంచి వస్తున్న స్పందన పట్ల ఆనందంగా ఉంది. ప్రజలు ఎలక్ట్రానిక్ వెహికిల్స్వైపు మొగ్గు చూపుతున్నారు అనడానికి ఇది నిదర్శనం. వాహన తయారీ రంగంలో కీలక మార్పులు తీసుకురావాలన్న మా లక్ష్యానికి ముందడుగు పడింది."