సౌదీ అరేబీయాలోని చమురు క్షేత్రాలపై ఆదివారం హౌతీ తిరుగుబాటుదారుల దాడుల తర్వాత అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఈ దాడితో బ్రెంట్ క్రూడ్ ధర ఏడాది కాలంలో తొలిసారి (బ్యారెల్కు) 70 డాలర్లపైకి చేరింది. బ్యారెల్ ముడి చమురు ధర సోమవారం 1.14 డాలర్లు పెరిగి.. 70.74 డాలర్లకు చేరింది. గత శుక్రవారంతో పోలిస్తే ఈ ధర 2.62 డాలర్లు ఎక్కువ.
అమెరికా బెంచ్ మార్క్ ముడి చమురు ధర కూడా బ్యారెల్కు 1.10 డాలర్లు పెరిగి.. 67.19 డాలర్ల వద్దకు చేరింది. శుక్రవారం దీని ధర 66.09 డాలర్ల వద్ద ఉంది.