తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆగని పెట్రో మంట.. మరో 30 పైసలు పెంపు - భోపాల్​లో లీటర్ పెట్రోల్ ధర

దేశంలో ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.42 కు చేరింది. భోపాల్​లో రూ.105.49గా ఉంది.

increased petrol prices
పెట్రోల్​ బాదుడు

By

Published : Jun 20, 2021, 7:43 AM IST

దేశవ్యాప్తంగా మరోసారి చమురు ధరలు పెరిగాయి. పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 31 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలకు అనుగుణంగా దేశీయంగానూ పెట్రోల్, డీజిల్ ధరలను సవరించినట్లు సంస్థలు వెల్లడించాయి. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ. 97.28, డీజిల్​ రూ. 88.03 వద్ద ఉంది. వాణిజ్య రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.42గా నమోదైంది. ఇక లీటర్ డీజిల్ ధర 95.50 వద్దకు చేరింది.

రికార్డు ధర..

మధ్యప్రదేశ్​ భోపాల్​లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.49వద్ద అమ్ముడవుతోంది. లీటర్ డీజిల్ ధర.. రూ.96.71 వద్ద ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇలా..

  • హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.101.19, డీజిల్ రూ.95.95గా ఉన్నాయి.
  • ఆంధ్రప్రదేశ్​ గుంటూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ.103.42ఉండగా.. డీజిల్‌ రూ.97.67కు చేరింది.

ABOUT THE AUTHOR

...view details