తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆరేళ్ల కనిష్ఠానికి దేశ వృద్ధి రేటు.. 5 శాతంగా నమోదు

ఆర్థికవ్యవస్థను పరుగులు పెట్టించేందుకు ఒకవైపు కేంద్రం చర్యలు తీసుకుంటున్న వేళ... దేశ వృద్ధిరేటు ఈ ఆర్థిక సంవత్సరం తొలిత్రైమాసికంలో ఆరేళ్ల కనిష్టానికి దిగజారింది. జీడీపీ 5 శాతంగా నమోదైందని జాతీయ గణాంక సంస్థ(ఎన్​ఎస్​ఓ) ప్రకటించింది.

ఏడేళ్ల కనిష్ఠానికి దేశ వృద్ధి రేటు.. 5 శాతంగా నమోదు

By

Published : Aug 30, 2019, 7:18 PM IST

Updated : Sep 28, 2019, 9:33 PM IST

తయారీ రంగంలో క్షీణత, వ్యవసాయ స్తబ్ధత కారణంగా 2019-20 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దేశ వృద్ధి రేటు(జీడీపీ) 5 శాతంగా నమోదైంది. జాతీయ గణాంక సంస్థ(ఎన్​ఎస్​ఓ) ఈ వివరాల్ని ప్రకటించింది.

తయారీ రంగంలో గ్రాస్ వాల్యూ యాడెడ్‌ (జీవీఏ) వృద్ధి 0.6 శాతంగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఇది 12.1 శాతంగా ఉంది. వ్యవసాయ రంగంలో జీవీఏ 2 శాతంగా నమోదు కాగా గతేడాది ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో 5.1గా ఉంది. నిర్మాణ రంగంలో గత ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 9.6 శాతంగా నమోదైన జీవీఏ 5.7 శాతానికి దిగజారింది. మైనింగ్ రంగంలో మాత్రం వృద్ధిరేటు 0.4 శాతం నుంచి 2.7శాతానికి పెరిగింది.

ఇవే కారణాలు...

2012-13 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో 4.9గా నమోదైన జీడీపీ ఆ తర్వాత ఈ స్థాయిలో క్షీణించడం ఇదే తొలిసారి. కార్లనుంచి బిస్కెట్ల వరకూ అమ్మకాల్లో తగ్గుదల వివిధ రంగాల్లో ఉద్యోగుల ఉద్వాసన, వినియోగదారుల కొనుగోళ్లలో తగ్గుదల సహా ప్రైవేట్ పెట్టుబడుల క్షీణత కారణంగానే జీడీపీ దిగజారినట్లు ఆర్థిక వేత్తలు విశ్లేషిస్తున్నారు.

జీడీపీ తగ్గుముఖం పట్టొచ్చని ఆర్​బీఐ సైతం ఇటీవల పేర్కొంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దేశ జీడీపీ అంచనాలను ఇటీవల 7 శాతం నుంచి 6.9 శాతానికి తగ్గించిన ఆర్​బీఐ.. మొదటి అర్ధభాగంలో 5.8 నుంచి 6.6 శాతం మధ్య నమోదు కావచ్చని పేర్కొంది. ద్వితీయార్ధంలో 7.3-7.5 శాతం మధ్య ఉండొచ్చని అంచనా వేసింది.

ఇదీ చూడండి: బ్యాంకింగ్​ రంగ ప్రక్షాళన... ప్రభుత్వ బ్యాంకుల విలీనం

Last Updated : Sep 28, 2019, 9:33 PM IST

ABOUT THE AUTHOR

...view details