తెలంగాణ

telangana

ETV Bharat / business

మార్కెట్​లోకి నిస్సాన్​ కొత్త కారు... ఆకట్టుకుంటున్న ఫీచర్లు - మార్కెట్​లోకి నిస్సాన్​ కొత్త కారు

ఆకర్షణీయమైన పీచర్లతో సరసమైన ధరలో మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకునేలా మరో కొత్తకారును నిస్సాన్​ సంస్థ లాంచ్​ చేసింది. నిస్సాన్​ మ్యాగ్నైట్​ పేరుతో విడుదలైన ఈ కారును... 'మేడిన్ ఇండియా- మేకిన్ ఇండియా' కాన్సెప్ట్​తో రూపొందించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

nissan company released new car in to market in hyderabad
nissan company released new car in to market in hyderabad

By

Published : Dec 2, 2020, 10:51 PM IST

Updated : Dec 2, 2020, 11:21 PM IST

మార్కెట్​లోకి నిస్సాన్​ కొత్త కారు... ఆకట్టుకుంటున్న ఫీచర్లు

భారతీయ మార్కెట్‌లోకి నిస్సాన్ సంస్థ మరో కొత్త కారును విడుదల చేసింది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని షోరూంలో నిస్సాన్ మ్యాగ్నైట్ కారును సంస్థ ప్రతినిధులు లాంచ్ చేశారు. మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకునే రీతిలో రూపొందించిన ఈ కారు ధర ఐదు లక్షల నుంచి రూ. 9 లక్షల 35 వేల వరకు ఉందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

'మేడిన్ ఇండియా- మేకిన్ ఇండియా' కాన్సెప్ట్​తో రూపొందించిన ఈ కారు అత్యుత్తమ ఫీచర్లతో వినియోగదారులకు ఎంతగానో ఆకట్టుకుంటుదని సంస్థ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నగరానికి చెందిన పలువురు మోడల్స్ సందడి చేశారు ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఆకట్టుకున్నారు.

ఇదీ చూడండి: ప్రేమించాడని యువకుడిని చంపిన యువతి తరఫు బంధువులు

Last Updated : Dec 2, 2020, 11:21 PM IST

ABOUT THE AUTHOR

...view details