తెలంగాణ

telangana

ETV Bharat / business

దేశంలో ఎన్​ఎఫ్​టిఫై కార్యకలాపాలు షురూ..!

ఎన్​ఎఫ్​టిఫై.. భారత్​ దేశంలో కార్యకలాపాలు మొదలుపెట్టింది. క్రిప్టో కరెన్సీ విధంగానే ఎన్​ఎఫ్​టీకి భారత్​లో ఆదరణ పెరుగుతున్న క్రమంలో ఎన్​ఎఫ్​టిఫై భారతదేశంలోకి అడుగుపెట్టడం విశేషం.

By

Published : Sep 3, 2021, 7:47 PM IST

Updated : Sep 4, 2021, 8:14 AM IST

nftify platform lauched in india
ఎన్ఎఫ్టీ

నాన్ ఫంజిబుల్ టోకెన్ల ట్రేడింగ్ మార్కెట్ ప్లేస్​ ఎన్​ఎఫ్​టిఫై భారతదేశంలో కార్యకలాపాలు ప్రారంభించింది. డిజిటల్ ఆర్ట్​ను బ్లాక్ చైన్ రూపంలో నిల్వ చేసినట్లయితే దాన్నే నాన్ ఫంజిబుల్ టోకెన్ అంటారు. క్రిప్టో కరెన్సీ మాదిరిగానే ఎన్​ఎఫ్​టీ కూడా భారత్​లో ఇటీవలే ప్రాచుర్యం పొందుతోంది.

ట్విటర్​ ప్రకారం క్రిప్టో గురించి చర్చించే వారి శాతం భారత్​లో 43 శాతం పెరిగింది. ఆర్ట్ కు సంబంధించినంత వరకు ఎన్​ఎఫ్​టీలు సరైన మార్కెట్​ను ఇవ్వటమే కాకుండా కొత్తగా ఆర్ట్ సృష్టించాలనుకునే వారికి ఎన్ఎఫ్​టీలు సరైన మార్గమని ఎన్​ఎఫ్​టిఫై వెల్లడించింది. డిజిటల్ ఆర్ట్​ను తమ ప్లాట్ ఫామ్ ద్వారా తయారు చేయవచ్చని, అంతేకాకుండా స్వంత బ్రాండ్​తో స్టోర్​ను ప్రారంభించుకోవచ్చని నిర్వాహకులు ప్రకటించించారు. పెద్ద ఆర్టిస్టులకే కాకుండా అందరికి అవకాశం ఇస్తుందని వారు తెలిపారు.
ఇందులో మైనింగ్ ఫీజు కూడా తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు ఎన్​ఎఫ్​టీని తయారు చేసేందుకు తమ ప్లాట్ ఫామ్ ఉద్దేశించినదని సీఈఓ నిఖిత వ్యాఖ్యానించారు.

కళల విషయంలో భారత్​కు ఎనలోని నైపుణ్యం ఉందని, కాని కళాకారులు గ్లోబల్ ప్లాట్ ఫామ్ లపై మార్కెట్ చేసుకోవటంలో ఇబ్బందులు పడుతున్నారని.. దీన్ని అధిగమించేందుకు ఈ ప్లాట్ ఫామ్ తయారు చేశామని భారత వృద్ధి కార్యకలాపాలు సారథి శ్రీనాథ్ రెడ్డి అన్నారు.

ఇదీ చదవండి:JioPhone Next: రూ.500కే జియో స్మార్ట్​ఫోన్​?

Last Updated : Sep 4, 2021, 8:14 AM IST

ABOUT THE AUTHOR

...view details