తెలంగాణ

telangana

ETV Bharat / business

'ఏడాదిలో నూతన జాతీయ ఈ-కామర్స్​ విధానం' - పీయూష్‌ గోయల్‌

ఈ కామర్స్‌ రంగంలో సంపూర్ణ వృద్ధిని సాధించేందుకు 12 నెలల్లోగా నూతన జాతీయ విధానాన్ని తీసుకొస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ కామర్స్‌ సంస్థలు, వాటాదారులతో రెండో సారి సమావేశమైన వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.

'ఏడాదిలో నూతన జాతీయ ఈ-కామర్స్​ విధానం'

By

Published : Jun 25, 2019, 9:12 PM IST

ఏడాదిలోగా ఈ-కామర్స్ రంగంలో నూతన జాతీయ విధానాన్ని తీసుకురానున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ రంగంలో సంపూర్ణ వృద్ధే లక్ష్యంగా నూతన విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపింది. ఈ కామర్స్‌ సంస్థలు, వాటాదారులతో సోమవారం రెండో సారి సమావేశమైన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.

" ఈ కామర్స్‌ రంగంలో సంపూర్ణ వృద్ధిని సాధించేందుకు 12 నెలల్లోగా నూతన జాతీయ విధానాన్ని తీసుకొస్తాం."

-పీయూష్​ గోయల్​, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి

ఈ ఏడాది ఫిబ్రవరిలో జాతీయ ఈ కామర్స్‌ పాలసీ ముసాయిదాను విడుదల చేసింది ప్రభుత్వం. సీమాంతర డేటా ప్రవాహంపై పరిమితులను విధించేందుకు చట్టపరమైన, సాంకేతికమైన వ్యవస్థను ఏర్పాటుచేయాలని ప్రతిపాదించింది. వీటితో పాటు స్థానికంగా సున్నితమైన డేటాను సేకరించి విదేశాల్లో నిల్వ చేయడం వంటి వ్యాపారాలకు షరతులను విధించింది. అయితే ఈ ముసాయిదాలోని కొన్ని అంశాలపై పలు విదేశీ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఫలితంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ముసాయిదాపై ఉన్న అభ్యంతరాలను తెలుసుకునేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కామర్స్‌ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై గతంలో విడుదల చేసిన పత్రికా ప్రకటన కేవలం స్పష్టత కోసమేనని ఎఫ్​డీఐ(విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు) విధానంలో ఎలాంటి మార్పులు ఉండబోవని పీయూష్‌ గోయల్‌ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: ఒడిశా: పట్టాలు తప్పిన సమలేశ్వరి ఎక్స్​ప్రెస్

ABOUT THE AUTHOR

...view details