తెలంగాణ

telangana

ETV Bharat / business

20 కోట్లు దాటిన నెట్​ఫ్లిక్స్​ వినియోగదారులు

కరోనా సమయం నెట్​ఫ్లిక్స్​ ఓటీటీకి బాగా కలిసొచ్చింది.​ వినియోగదారుల సంఖ్య 20 కోట్లు దాటిందని ఆ సంస్థ తెలిపింది.

By

Published : Jan 21, 2021, 4:00 PM IST

Netflix surpasses 200mn paid subscribers
20కోట్ల మార్క్​ను దాటిన నెట్​ఫ్లిక్స్​ వినియోగదారులు

కరోనా కాలంలో థియేటర్లు మూతపడడం వల్ల ఓటీటీలో సినిమాలు చూసే వారి సంఖ్య పెరిగింది. దాంతో ఈ కరోనా కాలం నెట్​ఫ్లిక్స్​కు బాగా కలిసొచ్చిందనే చెప్పొచ్చు. తమ​ వినియోగదారుల సంఖ్య 20కోట్లను దాటినట్లు ఆ సంస్థ తెలిపింది. మొత్తంగా ఒక్క 2020లోనే 3 కోట్ల 70 లక్షల వినియోగదారులు పెరిగారని పేర్కొంది. 2020లో 25 బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు ప్రకటించింది.

నెట్​ఫ్లిక్స్​ను స్థాపించిన 2018 నుంచి ఇప్పటి వరకు వినియోగదారుల సంఖ్య 111 మిలియన్ల నుంచి 204 మిలియన్లకు చేరింది. విదేశీ మారక ద్రవ్యంలో ఒడుదొడుకులు ఎదురైనప్పటికీ సగటు వినియోగదారుడు చెల్లించే రుసుము రూ.721 (9.88 డాలర్ల) నుంచి రూ.804 (11.02 డాలర్ల)కు పెరిగింది. దీనివల్ల కొన్ని సంవత్సరాలుగా నెట్​ఫ్లిక్స్​కు నాలుగు నుంచి 5 బిలియన్​ డాలర్ల ఆదాయం సమకూరింది.

-నెట్​ఫ్లిక్స్​

ఒక్క నాలుగో త్రైమాసికంలోనే 85 లక్షల వినియోగదారులు నెట్​ఫ్లిక్స్​లో చేరినట్లు ప్రకటించింది. దాంతో నాలుగో త్రైమాసికంలో 6.64 బిలియన్ల ఆదాయం వచ్చిందని పేర్కొంది.

ఇదీ చూడండి:ఓటీటీ.. నీకు ఇంత క్రేజ్ ఎందుకమ్మా?

ABOUT THE AUTHOR

...view details