తెలంగాణ

telangana

ETV Bharat / business

లోగో మార్చిన మింత్రా.. ఎందుకంటే?

మహిళల గౌరవానికి భంగం కలిగించే విధంగా లోగో ఉందంటూ వచ్చిన ఫిర్యాదుల అనంతరం.. స్వల్ప మార్పులు చేసింది ఆన్​లైన్​ దుస్తుల విక్రయ సంస్థ. కొత్త లోగోను మింత్రా వెబ్​సైట్​, యాప్​లోనూ మార్చింది. లోగో విషయంలో కంపెనీ తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు స్వాగతించారు.

By

Published : Jan 31, 2021, 5:56 AM IST

ప్రముఖ ఆన్‌లైన్‌ దుస్తుల విక్రయ సంస్థ మింత్రా లోగో మారింది. కంపెనీ చిహ్నం అభ్యంతరకరంగా ఉందన్న ఫిర్యాదు మేరకు లోగోలో స్వల్ప మార్పులు చేసింది. కొత్తలోగోను మింత్రా వెబ్‌సైట్‌, యాప్‌లోనూ మార్చింది. ప్యాకింగ్‌పైనా కొత్త లోగో రానుంది.

ముంబయికి చెందిన అవెస్టా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు నాజ్‌ పటేల్‌.. మింత్రా లోగోపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లోగోలోని (ఎం- అక్షరం) అక్షరం మహిళల గౌరవానికి భంగం కలిగించే విధంగా ఉందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై మింత్రా సానుకూలంగా స్పందించి మార్పులు చేసేందుకు అంగీకరించిందని డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ రష్మీ కరందికార్‌ తెలిపారు.

లోగో విషయంలో కంపెనీ తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు స్వాగతించారు. మరికొందరు మాత్రం.. అసలు లోగోలో మార్పులు చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. 'మాకూ ఈ లోగో విషయంలో అభ్యంతరం' ఉందంటూ వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు.

ఇదీ చూడండి:షావోమి కొత్త ఫోన్​.. ఎటు తిప్పినా డిస్​ప్లేనే!

ABOUT THE AUTHOR

...view details