భారత్లోని అత్యంత ధనవంతుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. ఓ నివేదిక గణాంకాల ప్రకారం అంబానీ మొత్తం సంపద 77.8 బిలియన్ డాలర్లు. ఇదే జాబితాలో అదానీ సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీ రెండో స్థానంలో నిలిచారు. ఆయన సంపద 53.8 బిలియన్ డాలర్లు.
భారత కుబేరుల్లో అగ్రస్థానంలో అంబానీ! - లక్ష్మీ నివాస్ మిత్తల్ ఆస్తి విలువ
ఓ నివేదిక ప్రకారం దేశంలో కుబేరుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. అదానీ గ్రూప్స్ ఛైర్మన్ గౌతమ్ అదానీ రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ జాబితాలో జిందాల్ స్టీల్ అధినేత్రి సావిత్రి జిందాల్ ఏకైక మహిళ కాగా.. ఆమె పదో స్థానానికి పరిమితమయ్యారు.
భారత్ కుబేరుల్లో అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ
జాబితాలోని ఇతర కుబేరులు..
- శివ్ నాడార్(హెచ్సీఎల్ టెక్నాలజీస్) 24 బిలియన్ డాలర్ల సంపదతో మూడో స్థానంలో నిలిచారు.
- ఆర్సెలార్ మిత్తల్ సీఈఓ లక్ష్మీ నివాస్ మిత్తల్ 16.8 బిలియన్ డాలర్ల సంపదతో నాల్గో స్థానంలో ఉన్నారు.
- కోటక్ మహీంద్ర బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ ఈ జాబితాలో 5వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఈయన సంపద 15 బిలియన్ డాలర్లు.
- ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ బిర్లా 12.8 బిలియన్ డాలర్ల సంపదతో ఆరో స్థానంలో నిలిచారు.
- పూనావాల్ గ్రూప్ ఛైర్మన్ సైరస్ పూనావాలా ఈ జాబితోలో 7వ స్థానంలో ఉన్నారు. ఈయన ఆస్తి నికర విలువ 12.8 బిలియన్ డాలర్లు.
- సన్ ఫార్మా వ్యవస్థాపకుడు దిలీప్ సంఘ్వీ(10.5 బిలియన్ డాలర్లు), భారతీ ఎంటర్ప్రైజెస్ అధినేత సునీల్ మిత్తల్(10.4 బిలియన్ డాలర్లు)లు వరుసగా 8,9 స్థానాల్లో నిలిచారు.
- జిందాల్ స్టీల్ అధినేత్రి సావిత్రీ జిందాల్ ఈ జాబితాలో 10వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఆమె సంపద 10.2 బిలియన్ డాలర్లుగా అంచనా. టాప్ 10 కుబేరుల్లో సావిత్రి జిందాల్ ఒక్కరే మహిళ కావడం గమనార్హం.
ఇదీ చూడండి: కరోనాలోనూ కేఎఫ్సీ విస్తరణ- కొత్తగా 30 రెస్టారెంట్లు!