దేశ పౌరులు, సంస్థలు స్విస్ బ్యాంకులో దాచుకున్న నిల్వల్లో భారత్.. మూడు స్థానాలు పడిపోయి 77వ స్థానానికి చేరింది. ఈ విషయంలో 2018లో 74వ స్థానంలో ఉండేది భారత్. గతేడాదితో పోలిస్తే 2019 నాటికి బ్యాంకు నిధులు కూడా 0.01 శాతం తగ్గాయి. 2019లో మొత్తం విదేశీ నిధుల్లో మన దేశం వాటా 0.06 శాతంగా ఉంది. ఈ మేరకు స్విట్జర్లాండ్ నేషనల్ బ్యాంక్(ఎస్ఎన్బీ)తాజా విషయాలను వెల్లడించింది.
భారత్కు సంబంధించి మొత్తం రూ. 6,625 కోట్ల నిధులు స్విస్ బ్యాంక్లో ఉన్నట్లు ఎస్ఎన్బీ స్పష్టం చేసింది. గతేడాదితో పోలిస్తే ఇది 6 శాతం తక్కువ.
టాప్-5 ఇవే..
ఈ విషయంలో బ్రిటన్ 27శాతం నిల్వలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానాల్లో అమెరికా, వెస్టిండీస్, ఫ్రాన్స్, హాంగ్కాంగ్లు వరుసగా ఉన్నాయి. మొత్తం నిల్వల్లో టాప్-5 దేశాలే సుమారు 50 శాతం నిల్వలను కలిగిఉండగా.. టాప్-10 దేశాలు మూడింట రెండో వంతు సొమ్మును దాచాయి. తొలి 15 స్థానాల్లోని దేశాల మొత్తం విలువ 75 శాతంగా ఉంటుందని ఎస్ఎన్బీ తెలిపింది.
పొరుగు దేశాలూ అంతే..