తెలంగాణ

telangana

ETV Bharat / business

'దేశవ్యాప్తంగా ఇంటర్నెట్​కై బలమైన వ్యూహాలు'

దేశవ్యాప్తంగా ఇంటర్నెట్​ సేవలు అందించేందుకు మోదీ ప్రభుత్వం పక్కా వ్యూహాలను అనుసరిస్తోందని అమెరికా ఉన్నతాధికారి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్​బ్యాండ్​ అనుసంధానంలో సవాళ్లను అధిగమించాలని సూచించారు.

ఇంటర్నెట్

By

Published : Jun 13, 2019, 3:24 PM IST

2022 కల్లా దేశవ్యాప్తంగా ఇంటర్నెట్​ సేవలను విస్తరించేందుకు మోదీ ప్రభుత్వం పక్కా వ్యూహాలతో సిద్ధంగా ఉందని అమెరికా ఉన్నతాధికారి అజిత్​ పే ప్రశంసించారు. అయితే గ్రామీణ ప్రాంతాల అనుసంధానంలో భారీ సవాళ్లు ఉన్నాయని తెలిపారు.

"2022 కల్లా 50 శాతం దేశవ్యాప్తంగా ఇంటర్నెట్​ సేవలు, 50 శాతం గృహాలకు బ్రాడ్​బ్యాండ్​ కనెక్షన్​ అందేలా చేయటమే మోదీ ప్రభుత్వ లక్ష్యం. ఇందుకు వారు పక్కా వ్యూహాలను అనుసరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 20 లక్షల వైఫై హాట్​స్పాట్​ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. నెట్​వర్క్​ రీడిజైనింగ్​పై దృష్టి పెట్టారు."

-అజిత్​ పే, ఫెడరల్​ కమ్యూనికేషన్​ కమిషన్ ఛైర్మన్​

భారత్​, అమెరికాలో అధిక భాగం గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తారు. అసోం, ఉత్తరాఖండ్​, కర్ణాటక, అలస్కా, ఉటా, కన్సాస్​ లాంటి ప్రాంతాల్లో సరైన ఇంటర్నెట్​ సౌకర్యం లేదు. ఇక్కడ ప్రైవేట్​ రంగం ఒంటరిగా నిలదొక్కులేదని అజిత్​ అభిప్రాయపడ్డారు.

"ఇటువంటి ప్రాంతాలను అనుసంధానం చేసేందుకు అమెరికా ప్రభుత్వం ముందుకొచ్చింది. ప్రైవేట్​ కంపెనీలకు మద్దతుగా నిలిచింది. ఫలితంగా ఒక వారంలో 167 మిలియన్​ డాలర్లతో 60 వేల గ్రామీణ ప్రాంతాల్లోని గృహాలు, వ్యాపారాలకు ఇంటర్నెట్ అందించగలిగారు. భారత్​లోనూ ఇలాంటి పరిస్థితే కానీ పరిమాణం, వాతావరణం భిన్నమైనవి."

-అజిత్​ పే, ఫెడరల్​ కమ్యూనికేషన్​ కమిషన్ ఛైర్మన్​

అయితే ప్రైవేట్ సంస్థలు రూపొందించే పరికరాలతో మాత్రం ఇబ్బంది తప్పదంటున్నారు అజిత్​. జాతీయ భద్రత, సమగ్రత అనే అంశాలు ప్రైవేట్ కంపెనీలకు పట్టవని వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి: అంతర్జాల వినియోగంలో రెండో స్థానం మనదే

ABOUT THE AUTHOR

...view details