లాక్డౌన్ ఉన్నా ఆన్లైన్లో ఎలక్ట్రానిక్ పరికరాల విక్రయాలకు వీలు కల్పించాలని నిర్ణయించింది కేంద్రం. ఏప్రిల్ 20 నుంచి మొబైల్ ఫోన్లు, టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, ల్యాప్‌టాప్‌లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులను.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫాంల ద్వారా విక్రయించేందుకు అనుమతిస్తున్నట్లు హోం శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
డెలివరీ చేసే వాహనాలు రోడ్లపై ప్రయాణించేందుకు ఇ-కామర్స్ కంపెనీలు అనుమతి పొందాల్సి ఉంటుందని స్పష్టంచేసింది ప్రభుత్వం. వీటితో పాటు వాణిజ్య, ప్రైవేటు సంస్థలు పనిచేసేందుకు అనుమతించేలా మార్గదర్శకాలు జారీ చేసింది.