తెలంగాణ

telangana

ETV Bharat / business

ప్రియం కానున్న ఫోన్లు- దిగిరానున్న బంగారం - ధరలు తగ్గే వస్తువులు బడ్జెట్

2021 బడ్జెట్​లో కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు వస్తువులపై కస్టమ్స్ సుంకం పెంచింది. మరికొన్నివాటిపై తగ్గించింది. ఈ నేపథ్యంలో ఏ వస్తువులు ప్రియం కానున్నాయి? ఏ వస్తువుల ధరలు తగ్గనున్నాయి? ఓసారి పరిశీలిద్దాం.

mobiles-ac-and-refrigerator-to-be-costlier-gold-and-silver-to-be-cheaper
ప్రియం కానున్న ఫోన్లు- దిగిరానున్న పసిడి

By

Published : Feb 1, 2021, 5:01 PM IST

రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, ఎల్ఈడీ లైట్లు, మొబైల్ ఫోన్లు... వీటన్నింటి ధరలు త్వరలో పెరగనున్నాయి. ఆయా ఉత్పత్తులు విడిభాగాలపై కస్టమ్స్ డ్యూటీ పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల వినియోగదారులు వాడే ఈ సాధనాలు మరింత ప్రియం కానున్నాయి.

అయితే బంగారం, వెండి ధరలు మాత్రం కిందకు దిగిరానున్నాయి. దిగుమతులపై విధించే కస్టమ్స్ డ్యూటీని కేంద్రం హేతుబద్ధీకరించిన నేపథ్యంలో వీటి ధరలు తగ్గనున్నాయి.

తాజాగా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్​లోని అంశాల ప్రకారం ఏ పరికరాల ధరలు పెరుగుతాయో, ఏ వస్తువుల ధరలు తగ్గుతాయో చూద్దాం.

ధరలు పెరిగేవి ఇవే

  • రిఫ్రిజిరేటర్లు, ఏసీలలో ఉపయోగించే కంప్రెసర్లు
  • ఎల్ఈడీ దీపాలు, వాటి విడి భాగాలు, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు
  • ముడి సిల్క్, కాటన్
  • సోలార్ ఇన్వర్టర్లు, లాంతర్లు
  • వాహన విడిభాగాలు(సేఫ్టీ అద్దాలు, విండ్​స్క్రీన్ వైపర్లు, సిగ్నలింగ్ పరికరాలు)
  • మొబైల్ ఫోన్ విడిభాగాలు(పీసీబీఏ, కెమెరా మాడ్యూల్, కనెక్టర్లు, బ్యాక్ కవర్లు, సైడ్ కీస్)
  • మొబైల్ ఫోన్ ఛార్జర్ విడి భాగాలు
  • లిథియం-అయాన్ బ్యాటరీకి కావాల్సిన ముడి పదార్థాలు
  • ఇంక్ కార్ట్రిడ్జ్​లు, ఇంక్ స్ప్రే నాజిల్స్
  • తోలు ఉత్పత్తులు
  • నైలాన్ ఫైబర్, నూలు
  • ప్లాస్టిక్ బిల్డర్ వస్తువులు
  • పాలిష్ చేసిన సింథటిక్ రాళ్లు, పాలిష్ చేసిన క్యూబిక్ జిర్కోనియా

ధరలు తగ్గేవి ఇవే

  • బంగారం, బంగారు కడ్డీలు
  • వెండి, వెండి కడ్డీలు
  • ప్లాటినం, పల్లాడియం వంటి విలువైన లోహాలు
  • అంతర్జాతీయ సంస్థలు, దౌత్య కార్యాలయాలు దిగుమతి చేసుకునే వైద్య పరికరాలు

ఇదీ చదవండి:బంగారం, వెండిపై దిగుమతి సుంకం తగ్గింపు

ABOUT THE AUTHOR

...view details