తెలంగాణ

telangana

ETV Bharat / business

సుంకాల వివాదం లేకుండా చైనా దిగుమతులు ఆపొచ్చు!

భారత్​- చైనాల మధ్య ఘర్షణల నేపథ్యంలో చైనా ఉత్పత్తుల దిగుమతులను ఆపేయాలనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఆ దేశ ఉత్పత్తులను మానేయాలంటే సుంకాల రూపంలో అనేక వివాదాలున్నాయి. ఈ తరుణంలో దేశీయ ఉత్పత్తులను కాపాడేందుకు.. ఎలాంటి పన్నులు లేకుండానే చైనా దిగుమతులను అడ్డుకోవచ్చని వాణిజ్యరంగ నిపుణులు సూచిస్తున్నారు.

Measures to stop China imports
సుంకం లేకుండా.. చైనా దిగుమతులను ఆపొచ్చు!

By

Published : Jun 25, 2020, 7:36 AM IST

దేశీయ ఉత్పత్తులను కాపాడేందుకు విధించే యాంటీ డంపింగ్‌ డ్యూటీ వంటి సుంకాల వివాదం లేకుండానే చైనా నుంచి దిగుమతులను అడ్డుకునే మార్గాలున్నాయని వాణిజ్య రంగ నిపుణులు పేర్కొంటున్నారు. చైనా, కొరియా, వియత్నాంల నుంచి కొన్ని రకాల స్టీల్‌ ఉత్పత్తుల దిగుమతిపై మనదేశం యాంటీ డంపింగ్‌ డ్యూటీ విధిస్తూ మంగళవారం ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో వారు ఇలా తెలిపారు.

'ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) సుంకాల వివాదం లేకుండా.. చైనా దిగుమతులు ఆపే మార్గాలున్నాయ్‌ నిబంధనల ప్రకారం, విదేశీ దిగుమతుల వల్ల నష్టపోయే మన దేశీయ సంస్థ ఏదైనా ఫిర్యాదు చేయాలి. దీనిపై విచారణలు అవి జరిగి, ప్రాథమిక ఆదేశాలు వెలువడేందుకు కనీసం 2 నెలలు పడుతుంది. అదే ఇతర మార్గాల్లో అయితే సత్వరం దిగుమతులను అడ్డుకోవచ్చు' అని నిపుణులు చెబుతున్నారు.

చైనా కూడా ఇలాంటి విధానాలను అనేకసార్లు అవలంబిస్తోందని వాణిజ్యశాఖ మాజీ కార్యదర్శి అజయ్‌ దువా చెబుతున్నారు. అవేంటంటే...

  • బాల కార్మిక చట్టాలకు లోబడి ఉండమని కోరాలి. తదుపరి ఆయా దేశాలు విచారణ ప్రారంభించుకుని, ముగిసేవరకు ఎగుమతి చేయడానికి వీలుండదు.
  • ప్రపంచ మేధోసంపత్తి హక్కుల సంస్థ (డబ్ల్యూఐపీఓ) వద్ద ట్రేడ్‌మార్క్‌ ఉల్లంఘన కేసు కనుక ఒక దేశానికి సంబంధించినది పెండింగ్‌లో ఉంటే, అది పరిష్కారం అయ్యేవరకు సంబంధిత దేశ ఉత్పత్తుల ఎగుమతిని నిషేధించవచ్చు.
  • ఆయా దేశాల నుంచి వచ్చిన ఉత్పత్తులను కస్టమ్స్‌ వద్దే నిశిత పరిశీలన కోసం అట్టేపెట్టవచ్చు. ఎగుమతిదార్లకు చెల్లింపులు జరపొద్దని బ్యాంకులను ఆదేశించవచ్చు. ఒకవేళ దీనిపై ఫిర్యాదు అందితే, పరిశీలిస్తున్నామంటూ మన యంత్రాంగం సమయం గడపొచ్చు.
  • యుద్ధంతో పాటు ఇతర అంతర్జాతీయ పరిణామాలను పొందుపరచి, భద్రతా కారణాల రీత్యా కూడా చైనా వస్తువుల దిగుమతిని ఆపే అవకాశం ఉంది.

ఇదీ చదవండి:'ముకేశ్‌ జీ రండి.. చైనా వస్తువులను బహిష్కరిద్దాం'

ABOUT THE AUTHOR

...view details