రెండోదశ కరోనా విజృంభణ నేపథ్యంలో 2021 జూన్ 30 వరకు ఫ్రీ సర్వీస్‌తో పాటు వారంటీని పొడిగించినట్లు దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ బుధవారం ప్రకటించింది. మార్చి 15 నుంచి మే 31 వరకు ముగిసే ఫ్రీ సర్వీస్, వారంటీ కాలానికి ఈ పొడిగింపు వర్తిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
"అనేక రాష్ట్రాల్లో విధించిన లాక్‌డౌన్‌తో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ పొడిగింపుతో మా వినియోగదారులకు ఉపశమనం లభిస్తుంది. ఆంక్షల సడలింపు అనంతరం వారి తీరిక మేరకు ఈ సేవలను పొందవచ్చు."
-పార్థో బెనర్జీ, సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (సర్వీస్)
టొయోటా..
ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టొయోటా సైతం.. కరోనా సమయంలో వారంటీ, ఉచిత సర్వీస్‌ను ఒక నెల పొడిగిస్తున్నట్లు తెలిపింది. 'కస్టమర్ కనెక్ట్ ప్రోగ్రామ్ 2.0' ప్రీ-పెయిడ్ సర్వీస్ ప్యాకేజీలనూ పొడిగించింది.
"'కస్టమర్ కనెక్ట్ ప్రోగ్రామ్ 2.0' ద్వారా మా విలువైన కస్టమర్లలో విశ్వాసాన్ని నింపుతాం. నిబద్ధతను చాటుకునేందుకు టొయోటా ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది"