ప్రముఖ వాహన తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) వాహనాల ఉత్పత్తిని పెంచింది. నవంబర్‌లో 4.33 శాతం మేర అదనంగా వాహనాలను ఉత్పత్తి చేసింది. డిమాండ్‌లేమి కారణంగా గత 9 నెలలుగా వాహనాల ఉత్పత్తిని తగ్గిస్తూ వచ్చిన ఆ కంపెనీ.. తొలిసారి ఉత్పత్తిని పెంచడం గమనార్హం. నవంబర్ నెలలో మొత్తం 1,41,834 యూనిట్ల వాహనాలను ఉత్పత్తి చేసినట్లు తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఆ కంపెనీ పేర్కొంది. గతేడాది ఇదే సమయంలో ఆ కంపెనీ 1,35,946 యూనిట్లను ఉత్పత్తి చేసింది.
9 నెలల తర్వాత జోరు పెంచిన మారుతీ సుజుకీ
దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా వాహనాల ఉత్పత్తిలో జోరు పెంచింది. 4.33 శాతం మేర అదనపు వాహనాలను తయారు చేసింది. గత తొమ్మిది నెలలుగా ఉత్పత్తిలో రివర్స్ గేర్ వేసిన మారుతీ ప్రస్తుతం జోరు పెంచింది.
ప్రయాణికుల వాహనాలను నవంబర్‌లో 1,39,084 యూనిట్లను ఉత్పత్తి చేయగా.. గతేడాది నవంబర్‌లో ఈ సంఖ్య 1,34,149 యూనిట్లుగా ఉంది. 3.67 శాతం మేర అదనంగా వాహనాలను ఉత్పత్తి చేసింది. అలాగే యుటిలిటీ వాహనాలు, మిడ్ సైజ్ సెడాన్, లైట్ కమర్షియల్ వాహనాల ఉత్పత్తిని కూడా పెంచింది. మినీ, కంపాక్ట్ సెగ్మెంట్ కార్ల ఉత్పత్తిని మాత్రం తగ్గించింది. ఈ ఏడాది అక్టోబర్‌లో వాహన ఉత్పత్తిని 20.7 శాతం తగ్గించి 1,19,337 యూనిట్లను, సెప్టెంబర్‌లో 17.48 శాతం తగ్గించి 1,32,199 యూనిట్లను మాత్రమే మారుతీ సుజుకీ ఉత్పత్తి చేసింది.
ఇదీ చూడండి : చేతక్ టు పల్సర్... హమారా 'బజాజ్'కు సారథి ఆయనే