తెలంగాణ

telangana

ETV Bharat / business

రిలయన్స్​ జోరుతో స్టాక్​మార్కెట్ల సరికొత్త రికార్డు

Market opens at lifetime high
జీవితకాల గరిష్ఠ లాభాల్లో స్టాక్​మార్కెట్లు

By

Published : Nov 28, 2019, 9:43 AM IST

Updated : Nov 28, 2019, 3:55 PM IST

15:40 November 28

రిలయన్స్​ జోరుతో స్టాక్​మార్కెట్ల సరికొత్త రికార్డు

స్టాక్​ మార్కెట్లు నేడు జీవితకాల గరిష్ఠస్థాయిని తాకాయి. సెన్సెక్స్​ 109 పాయింట్ల లాభంతో 41,130 పాయింట్ల వద్ద ట్రేడింగ్​ ముగించింది. నిఫ్టీ 50 పాయింట్లు బలపడి 12,151 వద్ద స్థిరపడింది. ఇవాళ ఉదయం రిలయన్స్​ ఇండస్ట్రీస్​ లిమిటెడ్ మార్కెట్​ విలువ రూ.10.02 లక్షల కోట్లగా నమోదైంది. భారత సంస్థల్లో మొదటిసారి ఈ ఘనత అందుకున్న తొలి కంపెనీగా రికార్డు సృష్టించింది ఆర్​ఐఎల్​. 

10:36 November 28

రికార్డుల మోత మోగినా లాభాలు పరిమితమే!

దేశీయ స్టాక్​మార్కెట్లు ప్రారంభ ట్రేడింగ్​లో జీవితకాల గరిష్ఠ స్థాయిల్ని తాకాయి. నిరంతర విదేశీ పెట్టుబడుల ప్రవాహం, నవంబర్ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో షార్ట్ కవరింగ్ కలిసిరావడమే ఇందుకు కారణం.

ప్రారంభ ట్రేడింగ్​లో 141 పాయింట్లు లాభపడిన బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ ప్రస్తుతం 82 పాయింట్ల లాభంతో 41 వేల 161.54 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 20 పాయింట్లు వృద్ధిచెంది 12 వేల 122 వద్ద ట్రేడవుతోంది. 

పరిమితమైన లాభాలు

అమెరికా-చైనా మధ్య తాజాగా 'హాంకాంగ్'​ వివాదం ముసురుకోవడం, అది వాణిజ్య ఒప్పందంపై ప్రభావం చూపే అవకాశం ఉండడం వల్ల ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఆ ప్రభావంతో దేశీయ స్టాక్​మార్కెట్ల లాభాలు పరిమితమయ్యాయని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.

లాభాల్లో...

టీసీఎస్​, టాటా స్టీల్​, ఐసీఐసీఐ బ్యాంకు, ఎల్​ అండ్ టీ, ఎస్​బీఐ రాణిస్తున్నాయి.

నష్టాల్లో...

టాటా మోటార్స్, హెచ్​యూఎల్​, ఓఎన్​జీసీ, వేదాంత, హీరోమోటోకార్ప్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

రూపాయి విలువ

రూపాయి విలువ స్వల్పంగా తగ్గి, డాలరుకు రూ.71.37గా ఉంది.     

ముడిచమురు ధర

ప్రపంచ మార్కెట్​లో ముడిచమురు ధర 0.27 శాతం తగ్గింది. ప్రస్తుతం బ్యారెల్ ధర 62.84 డాలర్లుగా ఉంది.

09:25 November 28

మార్కెట్లలో అదే జోష్- జీవితకాల గరిష్ఠాలకు సూచీలు

ప్రారంభ ట్రేడింగ్​లో దేశీయ స్టాక్​మార్కెట్లు జీవితకాల గరిష్ఠ స్థాయిల్ని తాకాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 141 పాయింట్లు లాభపడి 41 వేల 161.54 కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 12 వేల 132 పాయింట్లతో ట్రేడవుతోంది. అంతర్జాతీయ సానుకూల పవనాలు,  నవంబర్ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో షార్ట్ కవరింగ్ కలిసివచ్చింది.

లాభనష్టాల్లో

భారతీ ఇన్​ఫ్రాటెల్, సిప్లా, టీసీఎస్, ఎస్​ బ్యాంకుల రాణిస్తుండగా, జీ ఎంటర్​టైన్​మెంట్​, వేదాంత, టాటా మోటార్స్, హిందాల్కో, హీరోమోటోకార్ప్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Last Updated : Nov 28, 2019, 3:55 PM IST

ABOUT THE AUTHOR

...view details