తెలంగాణ

telangana

ETV Bharat / business

వరుస లాభాలకు బ్రేక్​- సెన్సెక్స్​ 599 డౌన్​

స్టాక్​ మార్కెట్లపై బేర్​ పంజా విసిరింది. సెన్సెక్స్​ 599 పాయింట్లు తగ్గి.. మళ్లీ 51 వేల దిగువకు చేరింది. నిఫ్టీ 165 పాయింట్లు పతనమై.. 15 వేల 100 మార్కును కోల్పోయింది.

By

Published : Mar 4, 2021, 3:41 PM IST

స్టాక్​మార్కెట్ల జోరుకు బ్రేక్​ పడింది. మూడు వరుస సెషన్లలో లాభాల తర్వాత దేశీయ సూచీలు గురువారం కుప్పకూలాయి. బొంబాయి స్టాక్​ ఎక్సేంజి సూచీ సెన్సెక్స్ 599 పాయింట్లు పతనమైంది. చివరకు 50 వేల 846 వద్ద స్థిరపడింది. ఆరంభ ట్రేడింగ్​లో సెన్సెక్స్​ 800 పాయింట్లకుపైగా నష్టంతో.. 50 వేల 540 వద్ద కనిష్ఠానికి చేరింది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 165 పాయింట్లు పడిపోయి 15 వేల 81 వద్ద సెషన్​ను ముగించింది.

లాభనష్టాల్లో..

అల్ట్రాటెక్​ సిమెంట్​, శ్రీ సిమెంట్​, అదానీ పోర్ట్స్​, గ్రేసిమ్​, డా. రెడ్డీస్​ ల్యాబ్స్​ లాభాలను గడించాయి.

జేఎస్​డబ్ల్యూ స్టీల్​, హెచ్​డీఎఫ్​సీ, టాటా మోటార్స్​, బజాజ్​ ఫిన్​సర్వ్​, హిందాల్కో డీలపడ్డాయి.

ఇదీ చూడండి: 'కారు విలాసం కాదు.. అవసరం'

ABOUT THE AUTHOR

...view details