స్టాక్ మార్కెట్లు సోమవారం సరికొత్త రికార్డు స్థాయి వద్ద మగిశాయి. బుల్ జోరుతో బీఎస్ఈ-సెన్సెక్స్ 347 పాయింట్లు బలపడి జీవనకాల గరిష్ఠమైన 45,427 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 97 పాయింట్లు పెరిగి సరికొత్త జీవనకాల రికార్డు స్థాయి అయిన 13,356 వద్దకు చేరింది.
అమెరికా ఉద్దీపన ప్యాకేజీ ఆశలు సహా.. కొవిడ్ వ్యాక్సిన్‌పై పెరుగుతున్న సానుకూలతలు మదుపరుల సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఫలితంగా నమోదైన కొనుగోళ్ల మద్దతు మార్కెట్ల రికార్డు స్థాయి లాభాలకు కారణంగా తెలుస్తోంది. దీనితోపాటు ఆర్బీఐ, నీతి ఆయోగ్‌లు, ఆర్థి మంత్రిత్వ శాఖలు దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీ ఊహించినదానికన్నా వేగంగా జరుగుతున్నట్లు ప్రకటించడం లాభాలకు కలిసొచ్చినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 45,459 పాయింట్ల అత్యధిక స్థాయి (జీవనకాల గరిష్ఠం), 45,024 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 13,367 పాయింట్ల గరిష్ఠ స్థాయి(సరికొత్త రికార్డు స్థాయి), 13,241 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.