కరోనా కొత్త వేరియంట్ వార్తలు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లను(Stock Market Outlook) ముందుకు నడిపించనున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఆర్థిక గణాంకాలు, వాహన అమ్మకాలపై కూడా మదుపరులు దృష్టిసారించే అవకాశముందని తెలిపారు.
"కొవిడ్ కొత్త వేరియంట్(omicron variant news), విదేశీ సంస్థగత మదుపరుల ప్రవర్తనతో పాటు ఆర్థిక గణాంకాలు ఈ వారం మార్కెట్లకు దిశానిర్దేశం చేయనున్నాయి. కరోనా సంబంధిత పరిణామాలు మార్కెట్‌కు కీలకం కానున్నాయి. కొత్త వేరియంట్‌పై పలు టీకాల సమర్థత మార్కెట్లను ముందుకు నడిపించనున్నాయి. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా విధించే ఆంక్షలకు సంబంధించిన వార్తలు సూచీలను అస్థిర పరుస్తాయి."
- సంతోష్ మీనా, స్వస్తికా ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్
ఆర్థిక గణాంకాలు, ద్రవ్యోల్బణం సహా నవంబరు నెలలో వాహన అమ్మకాలు మార్కెట్లను ప్రభావితం చేస్తాయని సామ్కో సెక్యూరిటీస్ హెడ్ యేషా షా పేర్కొన్నారు. తయారీ, సేవా రంగాల పర్చేజింగ్ మేనేజర్స్ సూచీ(పీఎంఐ) సైతం మార్కెట్లపై(stock market outlook this week) ప్రభావం చూపవచ్చు.
భారతీయ రిజర్వు బ్యాంకు విధానాలు, ద్రవ్యోల్బణ డేటా మార్కెట్‌కు కీలకం కానున్నాయని కొటక్ సెక్యూరిటీస్ హెడ్(రిటైల్) శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు.