స్టాక్ మార్కెట్లను ఈ వారం స్థూల ఆర్థిక గణాంకాలు, కార్పొరేట్ల త్రైమాసిక ఫలితాలు ముందుకు నడిపించనున్నాయి. కరోనా సంబంధిత వార్తలు కూడా మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయని విశ్లేషకులు అంటున్నారు.
ఈ వారంలోనే పారిశ్రమికోత్పత్తి, రిటైల్, టోకు ద్రవ్యోల్బణం గణంకాలు విడుదల కానున్నాయి. ఈ గణాంకాలు మార్కెట్లను ప్రధానంగా ప్రభావితం చేసే అంశాలుగా చెబుతున్నారు నిపుణులు.
మరో వైపు అంతర్జాతీయంగా అమెరికా-చైనాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపైనా మదుపరులు దృష్టి సారించే అవకాశముందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సిద్దార్థ కింకా అన్నారు.