తెలంగాణ

telangana

ETV Bharat / business

LPG Cylinder Price: వినియోగదారులకు షాక్.. మళ్లీ పెరిగిన గ్యాస్​ ధర! - పెరిగిన గ్యాస్​ ధర వార్తలు

LPG Cylinder Price: కమర్షియల్ గ్యాస్ సిలిండర్​ ధర మరోసారి పెరిగింది. 19 కేజీల వాణిజ్య సిలిండర్​ ధర రూ. 100.50 పెంచినట్లు చమురు సంస్థలు తెలిపాయి. ఈ ధరలు నేటినుంచే(బుధవారం) అమల్లోకి వచ్చాయని పేర్కొన్నాయి.

LPG Cylinder Price
గ్యాస్​ ధర

By

Published : Dec 1, 2021, 11:08 AM IST

LPG Cylinder Price: కమర్షియల్ గ్యాస్​ ధరను రూ. 100.50 పెంచాయి చమురు సంస్థలు. దీంతో ప్రస్తుతం 19కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ. 2,101కు చేరింది. సవరించిన ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయని వాణిజ్య సంస్థలు తెలిపాయి. 14.2కేజీ, 5కేజీ, 10కేజీ కమర్షియల్ సిలిండర్​ల ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదని పేర్కొన్నాయి.

అయితే ఇంట్లో వినియోగించే సాధారణ వంటగ్యాస్ సిలిండర్ ధరల్లో మాత్రం ఎటువంటి మార్పు లేదని చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రకటించాయి.

నవంబరు 1న సైతం 19కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 266 పెంచాయి చమురు సంస్థలు. సెప్టెంబరు 1న రూ. 75 పెంచాయి.

ఇదీ చూడండి:'ఆరు నెలల్లో అందుబాటులోకి చిన్నారుల టీకా'

ABOUT THE AUTHOR

...view details