తెలంగాణ

telangana

ETV Bharat / business

వంట గ్యాస్​ ధర వరుసగా 3వ నెలలో పెంపు

వంటగ్యాస్, ఏటీఎఫ్​​ ధరలు పెంచినట్లు దేశీయ చమురు సంస్థలు ప్రకటించాయి. ఏటీఎఫ్​పై 2.5 శాతం, వంట గ్యాస్​పై 28 పైసలు ధర పెంచాయి.

వంట గ్యాస్​

By

Published : May 1, 2019, 4:01 PM IST

వంటగ్యాస్​, విమాన ఇంధనాల ధరల్ని సవరించాయి దేశీయి చమురు సంస్థలు. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఈ మార్పులు చేశాయి.

వంటగ్యాస్ ధర స్వల్పంగా...

రాయితీ సిలిండర్​పై 28 పైసలు, రాయితీలేని సిలిండర్లపై రూ.6 ధర పెంచాయి చమురు సంస్థలు. పెరిగిన ధరతో రాయితీ సిలిండర్​ దిల్లీలో ప్రస్తుతం రూ.496.14కి లభించనుంది. రాయితీ లేని సిలిండర్ ధర రూ.712.50కు చేరింది.

ఎల్​పీజీ ధరలు పెరగటం కూడా వరుసగా ఇది మూడో నెల. 2014తో పోల్చుకుంటే రాయితీ సిలిండర్​పై ఇప్పటి వరకు రూ.82 ధర పెరిగింది. కిరోసిన్​ ధరలనూ స్వల్పంగా పెంచాయి చమురు సంస్థలు.

ఏటీఎఫ్ ధరలు పైపైకి

విమానాల్లో వాడే ఇంధనం (ఏటీఎఫ్) ధర 2.5 శాతం (కిలో లీటర్​కు రూ.1,595.63) పెరిగింది. ప్రస్తుతం కిలో లీటర్​ ఏటీఎఫ్​ ధర రూ.65,067.85కి చేరింది. ఏటీఎఫ్ ధరలు పెరగటం వరుసగా ఇది మూడో నెల. ఏప్రిల్​లో​ దాదాపు ఒక శాతం... మార్చిలో అత్యధికంగా 8.1 శాతం ధర పెరిగింది.

ఇప్పటికే ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశీయ విమాన సంస్థలకు ఏటీఎఫ్ ధరల్లో పెరుగుదల మరింత భారంగా మారనుంది.

ABOUT THE AUTHOR

...view details