వరుసగా ఐదో సెషన్లోనూ స్టాక్ మార్కెట్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. బుధవారం సెషన్లో బీఎస్ఈ-సెన్సెక్స్ 66 పాయింట్లు తగ్గి 37,668 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 22 పాయింట్ల నష్టంతో 11,132 వద్దకు చేరింది.
ఆరంభంలో కాస్త సానుకూలంగా స్పందించిన సూచీలు.. అమ్మకాల ఒత్తిడితో మిడ్ సెషన్ తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. దేశ ఆర్థిక వృద్ధిపై వెలువడుతున్న ప్రతికూల అంచనాలు మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు, సెప్టెంబర్ డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగింపు దగ్గర పడుతుండటం కూడా నష్టాలకు కారణంగా తెలుస్తోంది.
ఇంట్రాడే సాగిందిలా
సెన్సెక్స్ 38,140 పాయింట్ల అత్యధిక స్థాయి, 37,313 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 11,259 పాయింట్ల గరిష్ఠ స్థాయి;11,024 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..