తెలంగాణ

telangana

ETV Bharat / business

ఫేస్​బుక్​ ఖాతాకు ఆధార్​ అనుసంధానం తప్పదా?

'యూజర్ ప్రొఫైళ్లకు ఆధార్​ అనుసంధానం' కేసుల బదిలీ విషయంలో ఫేస్​బుక్​ వేసిన పిటిషన్​ విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. ఫేస్​బుక్​ అభ్యర్థనపై కేంద్రంతోపాటు యూట్యూబ్​, ట్విట్టర్, గూగుల్ సహా మరికొన్ని సామాజిక మాధ్యమ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఈ విషయంపై సెప్టెంబర్​ 13 లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది.

ఫేస్​బుక్​ ఖాతాకు ఆధార్​ అనుసంధానం తప్పదా?

By

Published : Aug 20, 2019, 2:37 PM IST

Updated : Sep 27, 2019, 3:59 PM IST

ఫేస్​బుక్​ ఖాతాలకు ఆధార్​ను అనుసంధానించే వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. యూజర్ ప్రొఫైళ్లకు ఆధార్​ లింక్​ చేయడానికి సంబంధించి వేర్వేరు న్యాయస్థానాల్లో విచారణల్లో ఉన్న కేసులను సర్వోన్నత న్యాయస్థానానికి బదిలీ చేయాలని ఫేస్​బుక్​ వ్యాజ్యం వేసింది. ఈ పిటిషన్​పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది.

సామాజిక మాధ్యమ యూజర్​ ప్రొఫైళ్లకు ఆధార్​ అనుసంధానం తప్పనిసరి చేయాలంటూ మద్రాసు, బొంబాయి, మధ్యప్రదేశ్ హైకోర్టుల్లో ఇప్పటికే వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఫేస్​బుక్​ అభ్యర్థన మేరకు వీటన్నింటినీ కలిపి విచారించేందుకు సమ్మతించింది సుప్రీంకోర్టు. ఈ విషయంపై సెప్టెంబర్​ 13లోగా తమ అభిప్రాయం చెప్పాలంటూ కేంద్రంతో పాటు యూట్యూబ్​, ట్విట్టర్, గూగుల్ సహా మరికొన్ని సామాజిక మాధ్యమ సంస్థలకు నోటీసులు జారీ చేసింది.

మద్రాసు కోర్టులో.... విచారణ కొనసాగుతుంది

మద్రాసు హైకోర్టులో జరుగుతున్న విచారణపై స్టే ఇచ్చేందుకు మాత్రం సుప్రీం నిరాకరించింది. అయితే తుది తీర్పు వెలువరించవద్దని ఆదేశించింది.

అనుసంధానం తప్పనిసరి..

సామాజిక మాధ్యమాల్లో అసత్య, అశ్లీల, దేశవ్యతిరేక, ఉగ్రవాద భావజాలం వ్యాప్తిని అడ్డుకునేందుకు... యూజర్​ ప్రొఫైళ్లకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి అని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకు నివేదించింది. అయితే... ఇలా చేస్తే వినియోగదారుల గోప్యతకు భంగం కలుగుతుందని ఫేస్​బుక్​ వాదిస్తోంది.

ఇదీ చూడండి: వైరల్​: తోడేళ్ల గుంపుతో గజరాజు సరదా ఆట

Last Updated : Sep 27, 2019, 3:59 PM IST

ABOUT THE AUTHOR

...view details