ఆధార్‌తో పాన్ కార్డు జత చేయడానికి ఈ నెల 30 వరకే అవకాశముందని ఎస్బీఐ తమ ఖాతాదారులకు గుర్తు చేసింది. ఎలాంటి అంతరాయాలూ లేకుండా బ్యాంకు ద్వారా సేవలను పొందేందుకు నిర్ణీత గడువులోగా ఆధార్‌తో పాన్ కార్డు లింక్ చేయాలని ఎస్బీఐ తన ఖాతాదారులకు సూచించింది. ఈ మేరకు తన అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించింది.
నిర్ణీత గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే బ్యాంకుకు సంబంధించిన పలు లావాదేవీలకు పాన్ కార్డు పనిచేయదని హెచ్చరించింది. పాన్ కార్డును ఆధార్‌తో జత చేయడానికి ఈ ఏడాది మార్చి 31 వరకే అవకాశం ఉండగా.. కొవిడ్ నేపథ్యంలో ఆదాయ పన్ను శాఖ ఈ గడువును మూడు నెలలు పెంచుతూ జూన్ 30 వరకు పొడిగించింది.