దేశీయంగా ప్రపంచ స్థాయి యాప్‌లను రూపొందించేందుకు ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన 'ఆత్మ నిర్భర్ భారత్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్' ఎంట్రీలకు గడువు పెంచింది కేంద్రం. ఈ ఛాలెంజ్‌కు సాంకేతిక నిపుణుల నుంచి భారీ స్పందన వస్తున్నందున.. ఎంట్రీలను పంపేందుకు ఈ నెల 26వరకు గడువు పెంచినట్లు తెలిపింది. ఇంతకు ముందు ఈ గడువు జులై 18గా నిర్ణయించింది. ఈ ఛాలెంజ్‌ను ప్రధాని నరేంద్రమోదీ జులై 4న ప్రారంభించారు. మైగవ్.ఇన్ ద్వారా ఔత్సాహికులు తమ స్పందనలు పంపించొచ్చు.
ఇప్పటి వరకు వచ్చిన స్పందన..
ఇప్పటివరకు ఈ ఛాలెంజ్‌లో భాగంగా 8 విభాగాల్లో, 2,353 ఎంట్రీలు వచ్చినట్లు కేంద్ర ఐటీ సమాచారశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్వీట్ చేశారు.