తెలంగాణ

telangana

By

Published : Mar 1, 2020, 1:33 PM IST

Updated : Mar 3, 2020, 1:30 AM IST

ETV Bharat / business

ఈపీఎఫ్​ డిపాజిట్లపై వడ్డీ రేటు మళ్లీ 8.65 శాతమే!

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఈపీఎఫ్ డిపాజిట్లపై​ వడ్డీ రేటు 8.65 శాతంగా ఉండొచ్చని తెలుస్తోంది. ఈ నెల 5న జరగనున్న ఈపీఎఫ్​ఓ సెంట్రల్​ బోర్డ్​ ఆఫ్​ ట్రస్టీస్ సమావేశంలో వడ్డీ రేటు అంశం చర్చకు వచ్చే అవకాశముంది.

interest rate on EPF deposits for 2019-20
ఈపీఎఫ్​ఓ వడ్డీ రేట్లు

ఈపీఎఫ్ చందాదారుల డిపాజిట్లపై ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రేటు యథాతథంగా ఉంచనున్నట్లు తెలుస్తోంది. ఆరు కోట్ల మందికి లబ్ధిచేకూరే విధంగా కార్మిక మంత్రిత్వ శాఖ 8.65 శాతం వడ్డీని ఇచ్చేందుకే సుముఖంగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను 8.65 శాతం వడ్డీని ఇచ్చిన విషయం తెలిసిందే.

ఉద్యోగుల భవిష్య నిధి సంఘం (ఈపీఎఫ్​ఓ)... సెంట్రల్​ బోర్డ్​ ఆఫ్​ ట్రస్టీస్​(సీబీటీ) ఈ నెల 5న సమావేశం కానుంది. ఈ భేటీలో వడ్డీ రేటును నిర్ణయించే అంశం చర్చకు రావొచ్చని తెలుస్తోంది.

మరోవైపు ఈపీఎఫ్​ఓ డిపాజిట్లపై వడ్డీ రేటు 8.50 శాతానికి గానీ.. గత ఆర్థిక సంవత్సరానికి నిర్ణయించిన 8.65 శాతం కన్నా తక్కువగా ఉండొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

గతంలో ఈపీఎఫ్​ వడ్డీ రేట్లు..

  • 2017-18లో 8.55 శాతం
  • 2016-17లో 8.65 శాతం
  • 2015-16లో 8.88 శాతం
  • 2014-15లో 8.75 శాతం
  • 2013-14లో 8.75 శాతం
  • 2012-13లో 8.50 శాతం

ఇదీ చూడండి:హమ్మయ్యా.. బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా

Last Updated : Mar 3, 2020, 1:30 AM IST

ABOUT THE AUTHOR

...view details