తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆభరణాల విలువ రూ.2 లక్షలు దాటితే కేవైసీ తప్పనిసరి - కేవైసీ కేంద్ర ఆర్థికశాఖ

ఆభరణాల కొనుగోళ్లు రూ. 2లక్షలు దాటితే కేవైసీని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర ఆర్థికశాఖ. ఈ విషయాన్ని ఆర్థికశాఖలోని రెవెన్యూ విభాగం వెల్లడించింది.

kyc mandetory for ornaments purchased above rps.2Lakh
ఆభరణాల విలువ రూ.2 లక్షలు దాటితే కేవైసీ తప్పనిసరి

By

Published : Jan 9, 2021, 1:27 PM IST

రూ.2 లక్షలకు పైగా విలువైన ఆభరణాలను కొనుగోలు చేయడానికి కేవైసీ తప్పనిసరి చేసింది కేంద్రం. ఈ మేరకు.. స్పష్టత ఇచ్చింది ఆర్థిక మంత్రిత్వ శాఖ రెవెన్యూ విభాగం.

2 లక్షల రూపాయల కన్నా తక్కువ విలువైన బంగారం, వెండి, ఆభరణాలు, విలువైన రత్నాలు, రాళ్ల కొనుగోలుకు కేవైసీ అవసరం లేదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. బంగారం, వెండి, రత్నాలు, ఆభరణాల ప్రతి కొనుగోలుపై కేవైసి తప్పనిసరి కాదని కూడా పేర్కొంది.

ఇదీ చూడండి:-భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

ABOUT THE AUTHOR

...view details