తెలంగాణ

telangana

ETV Bharat / business

పేదరికంపై 'కుడుంబ' విజయం

పేదరికంపై కేరళ ప్రభుత్వం ప్రయోగించిన బ్రహ్మాస్త్రం "కుడుంబ శ్రీ మిషన్". ఇప్పటికే ఎంతో మంది మహిళల జీవితాల్లో మార్పు తెచ్చింది. లక్షల కుటుంబాల్లో వెలుగులు నింపింది. మహిళా శక్తి, సాధికారతకు తిరుగులేని ఉదాహరణగా నిలిచింది.

కుడుంబ శ్రీ తో మహిళ సాధికారత

By

Published : Mar 8, 2019, 12:03 PM IST

ఉపాధి కల్పన అందిస్తున్న కుడుంబ శ్రీ సంస్థ

ఈమె పేరు స్వాతి. ఊరు.. కేరళలోని కాసర్గాడ్. ఓ వైపు పేదరికం... మరో వైపు ఉపాధి కొరత. ఇవి చాలవన్నట్లు తలకు మించిన అప్పులు. ఏంచేయాలో పాలుపోని పరిస్థితిలో స్నేహితురాలి ద్వారా కుడుంబ శ్రీ మిషన్ గురించి తెలుసుకుంది స్వాతి. అక్కడ శిక్షణ తీసుకుంది. ప్రభుత్వ సాయంతో రుణం పొంది ప్రింటింగ్ ప్రెస్ పెట్టింది. ఆమెతో పాటు పది మందికి ఉపాధి కల్పించింది.

  • ఇది స్వాతి ఒక్కరి కథే కాదు. కేరళలో కుడుంబ శ్రీ ద్వారా ఎంతోమంది మహిళలు వేర్వేరు వృత్తుల్లో శిక్షణ తీసుకున్నారు. ఉపాధి పొందారు.

"కుడుంబ శ్రీ ద్వారా నా పరిస్థితి మెరుగుపడింది. ఇక్కడ పనిచేయడం వల్ల మేమంతా సంతోషంగా ఉన్నాం. నిజంగా ప్రభుత్వం నెలకొల్పిన ఈ పథకం మాకు ఎంతో ఉపయోగపడుతోంది"
-కుడుంబ శ్రీ ద్వారా ఉపాధి పొందిన మహిళ


"ఇక్కడ మహిళలతో కలిసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంది. పనివాతవరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది."
-కుడుంబ శ్రీ ద్వారా ఉపాధి పొందిన మహిళ

"ఈ షాపింగ్ మాల్​లో పనిచేసే వాళ్లందరూ ఆడవాళ్లే. సెక్యూరిటీ వాళ్ల దగ్గర నుంచి శుభ్రపరిచే వాళ్ల వరకు అందరూ ఎంతో సమన్వయంతో పనిచేస్తున్నారు"
-కుడుంబ శ్రీ ద్వారా ఉపాధి పొందిన మహిళ

కుడుంబ శ్రీ అంటే?
పేదరిక నిర్మూలనే లక్ష్యంగా.... 1992లో కేరళలోని అలప్పుళ జిల్లాలో తొలిసారి 7 వార్డుల్లో సామాజిక సమీకరణ ప్రయోగాలు నిర్వహించారు. పేదలకు ఉపాధి కల్పనే ప్రధానాంశంగా ఇవి సాగాయి. తర్వాత.. ఇలాంటి ప్రయోగమే చేసింది యూనిసెఫ్​. 1994లో మలప్పురంలో సామాజిక పోషక కార్యక్రమం చేపట్టింది. ఇందుకోసం 4వేల 448 స్వయం సహాయక సంఘాలు ప్రారంభించింది. ఈ ప్రయోగాలన్నీ సఫలం అయ్యాయి. వీటి నుంచి పుట్టుకొచ్చిన ఆలోచనే... కుడుంబ శ్రీ.

  • కేరళలో మహిళల అభ్యున్నతే లక్ష్యంగా 1998లో కుడుంబ శ్రీ మిషన్​ ప్రారంభించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. మూడంచెల పంచాయితీ రాజ్ వ్యవస్థలా ఈ మిషన్ పనిచేస్తోంది. గ్రామ,మండల, జిల్లాల వారీగా కుడుంబ శ్రీ మిషన్లు ఉన్నాయి.

ఎవరులబ్ధి పొందుతారు?
కొంత మంది మహిళలను గ్రూపుల్లో చేర్చుకుంటారు. ఉపాధి పొందడానికి కావాల్సిన శిక్షణ ఇస్తారు. అనంతరం రుణాలు సమకూర్చి పర్యవేక్షిస్తారు.

  • ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు..?

యూనిట్ల వారిగా పనిచేస్తుందీ కుడుంబ శ్రీ మిషన్. ఒక్కో యూనిట్లో 10 నుంచి 20 మంది వరకు మహిళలుంటారు. ప్రస్తుతం 2,77,175 యూనిట్లు కేరళ వ్యాప్తంగా పనిచేస్తున్నాయి. 43 లక్షలమంది ఈ కార్యక్రమం ద్వారా లబ్ధిపొందుతున్నారు.

ప్రతి ఆదివారం సమావేశమై తాము ఆర్జించిన మొత్తాన్ని పొదుపు చేస్తారు. సొమ్ము అవసరమైన వాళ్లు రుణంగా ఆ మొత్తాన్ని తీసుకోవచ్చు. ఈ యూనిట్లకు ఆయా జిల్లాల కుడుంబ శ్రీ మిషన్ ఇంఛార్జ్​గా ఉంటుంది.

మొదట్లో 700 కుడుబ శ్రీ యూనిట్లనే బ్యాంకు ఖాతాలకు అనుసంధానించారు. రెండు కోట్ల రూపాయల రుణాన్ని మాత్రమే సమకూర్చేవారు.

"గత ఏడాదిలో 2 రంగాల్లో విస్తారమైన పని కనబడింది. ముఖ్యంగా నిర్మాణ రంగంలో ఈ మార్పు కనిపించింది. కేరళలో నిర్మాణ రంగానికి సంబంధించి 300 మహిళా గ్రూపులున్నాయి. ఇళ్ల నిర్మాణంలో వారికి శిక్షణనిస్తాం. అనంతరం ఒక నివాసం పూర్తయిన తర్వాత మరొకటి వారికి అప్పగిస్తాం"

--ఎస్ హరికిశోర్, కుడుంబ శ్రీ మిషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

ABOUT THE AUTHOR

...view details