Jio Prepaid Recharge Through Whatsapp: జియో వినియోగదారులు త్వరలో వాట్సాప్‌ను ఉపయోగించి మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చని టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో-మెటా(ఫేస్‌బుక్ మాతృ సంస్థ) బుధవారం ప్రకటించాయి. వాట్సాప్ కమ్యూనికేషన్, చెల్లింపుల ప్లాట్‌ఫామ్‌తో భారత్‌లో మెరుగైన షాపింగ్ అనుభవాన్ని ఇస్తాయని ఇరు కంపెనీలు సంయుక్త ప్రకటనలో తెలిపాయి. కస్టమర్లకు వినూత్న సేవలందించేందుకు జియో-మెటా సంస్థలు పరస్పర సహకారంతో కలసి పనిచేస్తున్నట్లు జియో లిమిటెడ్ డైరెక్టర్ ఆకాశ్ అంబానీ తెలిపారు.
"వాట్సాప్-జియో భాగస్వామ్యంతో 'ప్రీపెయిడ్ రీఛార్జ్' మరింత సులభతరం అవుతుంది. అతి త్వరలో అందుబాటులోకి వచ్చే ఈ సేవలతో.. వినియోగదారులు అత్యంత సులభంగా రీఛార్జ్ చేసుకోగలుగుతారు"
--ఆకాశ్ అంబానీ
వాట్సాప్ ద్వారా జరిపే ఈ రీఛార్జీలన్నీ పూర్తి సురక్షితంగా.. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్‌గా ఉంటాయని సంస్థ ప్రకటించింది.
2021-సెప్టెంబర్ నాటికి జియోకు 43కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. 2020-ఏప్రిల్‌లో జియోలో రూ.43,574 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది మెటా.
వాట్సాప్‌లో జియోమార్ట్ సేవలు షురూ..